ఉల్లి రేంజ్ అలా ఉంది : పొలంలోంచి పంట తవ్వి పట్టుకుపోయారు 

  • Edited By: veegamteam , December 4, 2019 / 04:11 AM IST
ఉల్లి రేంజ్ అలా ఉంది : పొలంలోంచి పంట తవ్వి పట్టుకుపోయారు 
ad

బంగారాన్ని ఉల్లిపాయల్ని పక్క పక్కన పెడితే బంగారాన్ని వదిలేసి ఉల్లియాల్ని చోరీ రేంజ్ కు చేరుకున్నాయి ఉల్లి రేట్లు. ఈ క్రమంలో ఉల్లిపాయల్ని గొడౌన్ లో చోరీ జరిగింది. ఇంట్లో ఉండి ఉల్లిపాయల్ని దొంగలు ఎత్తుకుపోయారు అనే వార్తలు ఇటీవల వింటున్నాం. కానీ ఏకంగా పొలంలోకి వెళ్లి పంటల మీద ఉన్న ఉల్లి పాయల్ని తవ్వి ఎత్తుకెళ్లిన ఘటనలు కూడా జరుగుతున్నాయి అంటే ఉల్లి పాయల డిమాండ్ ఎలా ఉందో ఊహించుకోవచ్చు.

మధ్యప్రదేశ్ మాండ్‌సౌర్‌లోని రిచా గ్రామంలో ఓ రైతు పొలంలో పంట మీద ఉన్న ఉల్లిపాయల్ని తవ్వి ఎత్తుకెళ్లిపోయారు కొందరు దుండగులు. రిచా గ్రామంలో జితేంద్ర కుమార్ అనే రైతు తన పొలంలో ఉల్లి పంట వేసుకున్నాడు. కొన్ని రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఈ లోగా దొంగలు పొలంపై దాడి చేసి రూ.30 వేల రూపాల ఉల్లి పంట దొంగిలించుకుపోయారు. దీనిపై జితేంద్ర కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

జితేంద్ర కుమార్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ..కిలో ఉల్లిపాయలు రూ.100కు పెరుగుతున్న ఈ సమయంలో ఉల్లి పంటను దోచుకుపోయారని రైతు జితేంద్రకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.