viral video : నడిరోడ్డుపై మహిళ జుట్టు పట్టి ఈడ్చి ఈడ్చి కొట్టిన పోలీసులు..

ఈ కరోనా రోజుల్లో మాస్కులు పెట్టుకోకపోవటం తప్పే. ఆ తప్పు ఎంతమందిపై ప్రభావం చూపిస్తోంది తెలీలీదు. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మాస్కులు ధరించాల్సిందేననే పరిస్థితి ఉంది. ఈక్రమంలో మాస్కు పెట్టుకోలేదని ఓ మహిళను పోలీసులు అత్యంత దారుణంగా కొట్టారు. నడిరోడ్డుమీద ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చి ఈడ్చి లాగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

viral video : నడిరోడ్డుపై మహిళ జుట్టు పట్టి ఈడ్చి ఈడ్చి కొట్టిన పోలీసులు..

No Mask Women Police

ఈ కరోనా రోజుల్లో మాస్కులు పెట్టుకోకపోవటం తప్పే. ఆ తప్పు ఎంతమందిపై ప్రభావం చూపిస్తోంది తెలీలీదు. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మాస్కులు ధరించాల్సిందేననే పరిస్థితి ఉంది. ఈక్రమంలో మాస్కు పెట్టుకోలేదని ఓ మహిళను పోలీసులు అత్యంత దారుణంగా కొట్టారు. నడిరోడ్డుమీద ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చి ఈడ్చి లాగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కరోనా మహమ్మారి కొనసాగుతున్న క్రమంలో పోలీసులు వారియర్స్ గా డ్యూటీలు చేస్తున్నారు.నిజమే. డ్యూటీలో వారికి అనేక రకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇరిటేట్ అవుతుంటారు.ఒక్కోసారి విచక్షణ కోల్పోతుంటారు. ఈక్రమంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కూరగాయాలు కొనేందుకు తన కూతురితో కలిసి మార్కెట్‌కు వచ్చిన ఓ మహిళ మాస్క్ పెట్టుకోకపోవటంతో పోలీసులు ఆమెను అత్యంత దారుణంగా కొట్టారు. జుట్టు పట్టుకుని ఈడ్చి నడిరోడ్డుమీద ఇష్టానుసారంగా బాదారు.

మొదట మాస్కు పెట్టుకోని ఆమెను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె ప్రతిఘటించింది. దీంతో సంయమనం కోల్పోయిన పోలీసులు ఆమెను ఇష్టానుసారంగా కొట్టారు. వీరిలో ఓ లేడీ పోలీసు మాస్కు పెట్టుకోని మహిళను జుట్టుపట్టుకుని మరీ కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ వీడియోలో ఆమెను ఇద్దరు పోలీసులు లాక్కెళ్లడం..పలుసార్లు ఆమెను కిందపడేయటం..బలవంతంగా పోలీసు జీపు ఎక్కించేందుకు ప్రయత్నించటం..దానికి ఆమె ఒప్పుకోకపోవటంతో ఇలా చేసినట్లుగా ఉంది. తన తల్లితో పోలీసులు ఇలా వ్యవహరించడాన్ని ఆమె కూతురు కూడా ప్రతిఘటించింది. దీంతో పోలీసులు ఆమెను పక్కకు తోసేశారు.

అయితే అసలు ఆమెపై పోలీసులు అంత కఠినంగా వ్యవహరించడానికి అసలు కారణం ఆమె మాస్క్ ధరించకపోవడమే. కానీ మరీ ఓ మహిళతో అంత దారుణంగా ప్రవర్తించాలా? మాస్క్ పెట్టుకోకపోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద తప్పే. కానీ అలా చేయనుందుకు ఓ మహిళ పట్ల పోలీసులు మరీ ఇంత దారుణంగా వ్యవహరించడం ఏంటనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.