భోపాల్ చేరుకున్న కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు

  • Published By: venkaiahnaidu ,Published On : March 13, 2020 / 01:02 PM IST
భోపాల్ చేరుకున్న కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు

కొన్ని రోజులుగా బెంగళూరులోని ఓ రిసార్ట్ లో ఉంటూ కాంగ్రెస్ కు రాజీనామా చేసిన 19మంది మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు ఇవాళ(మార్చి-13,2020)భోపాల్ చేరుకున్నారు. భోపాల్ చేరుకున్నవారిలో  ఆరుగురు కేబినెట్ మంత్రులు కూడా భోపాల్ కు చేరుకున్నవారిలో ఉన్నారు. యితే భోపాల్ విమానాశ్రయంలో బీజేపీ కార్యకర్తలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. బీజేపీ నాయకులు దాదాపు రెండు బస్సుల్లో కార్యకర్తలను భోపాల్‌ విమానాశ్రయానికి తరలించారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలకు ఘర్షణ జరిగింది. భోపాల్ ఎయిర్ పోర్ట్ లో 144సెక్షన్ విధించారు.

జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో 6 గురు కేబినెట్ మంత్రులు సహా  కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, సీఎం కమల్‌నాథ్ సర్కారును సంక్షోభంలో నెట్టేసిన విషయం తెలిసిందే. సీఎం కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని సంక్షోభంలో నెట్టేసి, గద్దె దించాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్న విమర్శల నేపథ్యంలో బీజేపీ నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరు రిసార్ట్స్‌కు తరలించిన విషయం తెలిసిందే. 

మరోవైపు మంగళవారం(మార్చి-10,2020) రాజీనామాలు చేసిన ఆరుగరు మంత్రులతో సహా 22మందిలో,13మందికి స్పీకర్ ప్రజాపతి నోటీసులు జారీ చేశారు. శుక్రవారం లేదా శనివారం రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు తనను కలిసి రాజీనామాలు సమర్పించాలని స్పీకర్ ప్రజాపతి నోటీసులు జారీ చేశారు. చట్టం ప్రకారం రాజీనామాలు చేసే ఎమ్మెల్యేలు మొదటగా స్పీకర్ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని,ఆ తర్వాత కేసు యొక్క యోగ్యత ప్రకారం నిర్ణయించే ముందు స్పీకర్ అందుబాటులో ఉన్న సాక్ష్యాలను లేదా వాస్తవాలను పరిశీలిస్తారని స్పీకర్ ప్రజాపతి తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు ఎవ్వరూ చేజారిపోకుండా కాంగ్రెస్,బీజేపీలు జాగ్రత్త పడ్డాయి. కాంగ్రెస్ 94మంది ఎమ్మెల్యేలను జైపూర్ కి తరలించగా,బీజేపీ  తమ 102మంది ఎమ్మెల్యేలను గురుగావ్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ కి తరలించింది.

230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మెజార్టీ మార్క్ 116గా ఉంది. ఒకవేళ 22మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే మెజార్టీ మార్క్ 104గా ఉంది. ప్రస్తుతం బీజేపీ దగ్గర 107మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో బకవేళ బలపరీక్ష జరిగితే కమల్ నాథ్ సర్కార్ కూలిపోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.