డాక్టర్ నిర్వాకం :మత్తుమందు ఇచ్చి ఆపరేషన్ చేయకుండా వెళ్లిపోయాడు

  • Published By: veegamteam ,Published On : January 6, 2020 / 05:57 AM IST
డాక్టర్ నిర్వాకం :మత్తుమందు ఇచ్చి ఆపరేషన్ చేయకుండా వెళ్లిపోయాడు

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునేందుకు వచ్చిన 33మంది మహిళలకు డాక్టర్లు మత్తుమంది ఇచ్చి ఆపరేషన్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో డాక్టర్ల మధ్య ఓ విషయంపై వివాదం ఏర్పడింది. దీంతో డాక్టర్లు ఆపరేషన్ చేయకుండానే వెళ్లిపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని టీకామ్‌గఢ్ జిల్లా ఆసుపత్రిలో జరిగింది. 

డాక్టర్ల నిర్లక్ష్యం మహిళల ప్రాణాలమీదికి తెచ్చింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునేందుకు వచ్చిన 33 మంది మహిళలు ఆసుపత్రిలో నరకయాతన అనుభవించాల్సిన దుస్థితి ఏర్పడింది డాక్టర్ల నిర్లక్ష్యంతో  ఆ మహిళలకు ఆపరేషన్ చేసేముందు మత్తు ఇంజక్షన్  (అనస్థీషియా ఇంజెక్షన్)  ఇచ్చారు. తరువాత ఆసుపత్రి సిబ్బందికి, ఛతర్‌పూర్ నుంచి వచ్చిన డాక్టర్ కెకె చతుర్వేదికి మధ్య ఓ విషయమై వివాదం చోటుచేసుకుంది. దీంతో ఆ డాక్టర్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయకుండానే డాక్టర్ చతుర్వేది వెళ్లిపోయాడు. . దీంతో ఆసుపత్రి సిబ్బందికి ఏం చేయాలో సిబ్బందికి పాలుపోలేదు. అప్పటికే మత్తుమందు ఇచ్చిన మహిళల పరిస్థితి ఏమవుతుందోననే ఆందోళనతో మరోమార్గం లేక ప్రైవేటు ఆసుపత్రి నుంచి సర్జన్‌ను పిలిపించి ఆపరేషన్లను పూర్తిచేయించారు. 

కాగా..అంతకు మందు గంటపాటు ఆ మహిళలు స్పృహ లేని స్థితిలోనే ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. మరోవైపు ఆసుపత్రి సిబ్బంది… కుటుంబ నియంత్రణకు వచ్చిన మహిళలకు ఆపరేషన్ చేయకుండా వెళ్లిపోయిన డాక్టర్ డాక్టర్ కెకె చతుర్వేదిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామని తెలిపారు.