కొత్త చట్టం : వివాహం కోసం మతం మార్చుకోవటం ఇకపై నిషేధం

  • Published By: nagamani ,Published On : November 5, 2020 / 11:09 AM IST
కొత్త చట్టం : వివాహం కోసం మతం మార్చుకోవటం ఇకపై నిషేధం

Madhya pradesh law against religious conversion marriage : ప్రేమించుకున్నప్పుడు గుర్తుకురాని..అవసరం లేని మతం పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రం తప్పనిసరి అవుతోంది. ప్రేమించుకున్న యువతీ యువకులు వివాహం చేసుకునే సమయంలో మాత్రం మతం మార్చుకుంటున్నారు. ముస్లిం యువతి వేరే మతం అబ్బాయిని వివాహం చేసుకోవాలనుకున్నా..లేదా ముస్లిం యువకుడు వేరే మతం అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్నా..ముందుగా వారు మతం మారాల్సి వస్తోంది.


వారి పెళ్లికి మతం అడ్డుగా నిలవటంతో తప్పనిసరిగా మతం మారుతున్నారు. అది వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే జరుగుతోంది. కానీ ఇకపై పెళ్లి చేసుకోవాలంటే మతం మారాల్సిన పనిలేదంటోంది కొత్తగా రానున్న చట్టం.
https://10tv.in/keralas-quintuplets-get-married-on-the-same-stage-on-the-same-day/


వివరాల్లోకి వెళితే..వివాహం కోసం మతం మార్చుకుంటున్న ఘటనలు ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో మతం మారటాన్ని నిషేధిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొస్తామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. వివాహం పేరుతో మతం మార్చేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఈ సందర్భంగా అన్నారు.



వివాహం పేరుతో మతమార్పిడులను తాము ఎంతమాత్రమూ సహించబోమని, దీనిని అడ్డుకునేందుకు కఠిన చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు. త్వరలోనే ఈ చట్టం అమల్లోకి వస్తుందని అన్నారు. కాగా..‘‘లవ్ జిహాద్‌’’ను అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, హర్యానా రాష్ట్రాలు మత మార్పు నిషేధ చట్టాన్ని తీసుకొస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి.




ఈ క్రమంలో మధ్యప్రదేశ్ కూడా ఇటువంటి చట్టాన్ని తీసుకొచ్చేందుకు సీఎం శివరాజ్ సింగ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.