Madhya pradesh : మా నాన్నను అరెస్టు చేయండి సార్ అంటూ ఇద్దరు బాలికలు ఫిర్యాదు..

పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. వాళ్లు చెప్పింది విని ఆశ్చర్యపోయారు. వాళ్ల ఇంటికెళ్లిన పోలీసులు తండ్రికి వార్నింగ్ ఇచ్చారు.

Madhya pradesh : మా నాన్నను అరెస్టు చేయండి సార్ అంటూ ఇద్దరు బాలికలు ఫిర్యాదు..

MP Girls complaint against father

MP Girls complaint against father : ఇటీవల చిన్నారులు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదులు ఇవ్వటం సోషల్ మీడియాలో చూస్తున్నాం. వారి ఫిర్యాదులు వినటానికి నవ్వు వస్తుంది గానీ వాటి వెనుక ఉన్న కారణం మాత్రం ఆలోచించాల్సిందిగానే ఉంటున్నాయి. ఒకప్పుడైతే పోలీసులు అంటేనే భయపడేపరిస్థితి. కానీ ఇప్పుడు చిన్నారులు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. అంటే తమకు ఏమైన ఇబ్బంది కలిగినా..కష్టం ఉన్నా పోలీసులు ఉన్నారని..వారి సమస్యలు తీరుస్తారనే అవగాహన చిన్నారులకు కలగుతోంది. అంతేకాదు పోలీసుల్ని అంకుల్ అని పిలుస్తు వారి ఇబ్బంది చెప్పుకోవటం చూస్తే పోలీసులు తమ బంధువుల్లాగా చిన్నారు భావించి తమ ఇబ్బందులు చెపుకోవటం ఇటీవల చూస్తున్నాం.

అలా ఇద్దరు చిన్నారులు మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లాలో పోలీసు స్టేషన్ కు వచ్చి..‘అంకుల్.. అమ్మను కాపాడండి.. నాన్నను అరెస్టు చేయండి’ అంటూ పోలీసులను కోరారు. భిటర్వార్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. వారు ఏదో చెప్పటానికి వచ్చారని అర్థం చేసుకున్న పోలీసులు వారికి ధైర్యం చెప్పి చెప్పండమ్మా ఏంటీ ఇలా మీరిద్దరే వచ్చారు అంటూ ఆప్యాయంగా మాట్లాడుతు దగ్గరికి తీసుకుని కూర్చోబెట్టుకున్నారు. మీరేమీ భయపడాల్సిన పని లేదు.. మీరు ఎందుకొచ్చారో చెప్పండి అంటూ బుజ్జగించి అడిగారు స్టేషన్ ఇన్ చార్జ్ ప్రదీప్ శర్మ అడిగారు.

దానికి ఆ చిన్నారుల్లో పెద్ద పాప ‘‘ సార్ మా అమ్మను నాన్నరోజు కొడుతున్నాడు.. అమ్మ ఏడుస్తోంది..నాన్నను అరెస్టు చేయండి’’ అంటూ చెప్పింది. ఆ పాప చెప్పిందంతా విన్న ప్రదీప్ శర్మ ఏదో చిన్నపిల్లలే అని లైట్ తీసుకోలేదు. ఇంత దూరం వచ్చి పోలీసులకు భయపడకుండా తమ సమస్యను చెప్పారంటూ వారు ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకున్నారు. నేరుగా వారి ఇంటికి వెళ్లారు. పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. భార్యభర్తలు గొడవ పడుతూ ఉంటే.. పిల్లలపై చెడు ప్రభావం పడుతుందని నచ్చచెప్పారు. కుటుంబం అన్నాక సమస్యలుంటాయి. కానీ చిన్నపిల్లల ముందు వాటిని ప్రదర్శించకుండా సామరస్యంగా ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవాలి అని సూచించారు. అలాగే భార్యను కొట్టటం నేరం మరోసారి ఇలా జరగకుండా చూసుకో అంటూ ఆ పిల్లల తండ్రికి వార్నింగ్ ఇచ్చారు.

స్టేషన్ కొచ్చి అధికారి ముందు ఇద్దరు ఆడపిల్లలు కూర్చుని తమ సమస్య చెబుతున్న ఫొటో వైరల్ అవుతోంది. పెద్దమ్మాయి స్టేషన్ ఇన్ చార్జ్ ఎదురుగా కూర్చుని మాట్లాడుతుండగా, చిన్నమ్మాయి దిగులుగా కూర్చుని ఉంది. ఏమాత్రం భయపడకుండా స్టేషన్ దాకా వెళ్లిన పిల్లల ధైర్యాన్ని పోలీసులు ప్రశంసించారు.