Madhya Pradesh : సాయం చేసేందుకు వెళ్లి 11 మంది మృతి

మధ్యప్రదేశ్ బావిలో పడిన బాలుడిని రక్షించేందుకు వెళ్లి 30 మంది బావిలో పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. బావిలోంచి 11 మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు.

Madhya Pradesh : సాయం చేసేందుకు వెళ్లి 11 మంది మృతి

Madhya Pradesh

Madhya Pradesh : మధ్యప్రదేశ్ బావిలో పడిన బాలుడిని రక్షించేందుకు వెళ్లి 30 మంది బావిలో పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారని, వారి మృతదేహాలను వెలికితీశామని అధికారులు తెలిపారు. 19 మందిని అధికారులు సురక్షితంగా బయటకు తీశారు.

ఈ విషాద ఘటన విదిషా జిల్లా గంజ్ బసోడాలో గల లాల్ పాటర్ గ్రామంలో జరిగింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఐదు లక్షలు ప్రకటించారు సీఎం శివరాజ్ సింగ్ చౌహన్. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున అందచేయాలని తెలిపారు.

ఆ కుటుంబాలకు అండగా ఉంటామని చౌహాన్ తెలిపారు. ఇక ఈ ఘటనపై ప్రధాని కార్యాలయం ట్విట్టర్ ద్వారా స్పందించింది. మృతులకు ప్రగాఢ సంతాపం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు ప్రకటించింది.