Congress MLA: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై రేప్ కేసు పెట్టిన భార్య.. మానసికంగా, శారీరకంగా వేధించాడంటూ ఫిర్యాదు

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేపై రేప్ కేసు పెట్టింది అతడి భార్య. తనపై అత్యాచారం చేయడంతోపాటు పలు వేధింపులకు గురి చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

Congress MLA: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై రేప్ కేసు పెట్టిన భార్య.. మానసికంగా, శారీరకంగా వేధించాడంటూ ఫిర్యాదు

Congress MLA: మధ్య ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై రేప్ కేసు పెట్టింది అతడి భార్య. ధర్ జిల్లా, గంధ్వాని నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమాంగ్ సింఘార్‌పై అతడి భార్య అత్యాచారం, శారీరక, మానసిక వేధింపుల కింద ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

India vs New Zealand: రేపే న్యూజిలాండ్‌తో మూడో టీ20.. వర్షం ముప్పు తప్పదా?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింఘార్‌కు, బాధిత మహిళకు ఎమ్మెల్యేకు మధ్య కొంత కాలంగా శారీరక సంబంధం ఉంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఎమ్మెల్యే ఆమెతో సంబంధం కొనసాగించాడు. తర్వాత పెళ్లికి నిరాకరించాడు. ఆమె బలవంతపెట్టడంతో చివరకు ఈ ఏడాది ఏప్రిల్ 16న పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత నుంచి ఆమెను శారీరకంగా వేధించాడు. పలుమార్లు అత్యాచారం చేశాడు. మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేశాడు. అసభ్యకర వీడియోల పేరుతో ఆమెను బెదిరింపులకు గురి చేశాడు. ఈ క్రమంలో గత నెలలో ఆమెపై అత్యాచారం చేసేందుకు, హత్య చేసేందుకు కూడా ప్రయత్నించాడు. ఈ అంశాలన్నింటిపై ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసుల్ని కూడా ఎమ్మెల్యే బెదిరించాడని మహిళ పేర్కొంది.

Narayan Jagadeesan: విజయ్ హజారే ట్రోఫీలో రికార్డుల మోత.. 50 ఓవర్లలో 506 పరుగులు చేసిన తమిళనాడు.. దినేష్ కార్తీక్ విమర్శలు

అంతేకాకుండా తనపైనే అనేక అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేశాడని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు ఎమ్మెల్యే సింఘార్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాధిత మహిళ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకురాలే. అయితే, ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించాడు. తనను ఆ మహిళ రూ.10 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేసిందని, అందువల్లే తనపై అక్రమ కేసులు పెట్టిందని చెప్పాడు.