Rape : ఆహారం ఇస్తామని నమ్మించి అంబులెన్స్ లో మహిళపై అత్యాచారం

Rape : ఆహారం ఇస్తామని నమ్మించి అంబులెన్స్ లో మహిళపై అత్యాచారం

22 Years Women

Bhopal women rape : ఆకలేస్తోంది అన్నం పెట్టండి బాబూ అని అడిగితే ఎంతటి కఠిన హృదయం ఉన్నవారైనా కరిగిపోతారు. కానీ కామాంధులకు అవేవీ కనిపించవు. ఆకలితో అలమటించిపోయినా..కాటికి కాళ్లు చాపుకున్నవారైనా ఆడది అయితే చాలు. కామాంధులు రెచ్చిపోతారు. వారు ఎటువంటి దుస్థితిలో ఉన్నా..వారికి అదేమీ పట్టదు. కనీసం మనిషిగా కూడా ఆలోచించరు.పశువుల్లా మారి కామం తీర్చుకుంటారు. అటువంటి ఘటనే జరిగింది మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ లో.

ఆకలేస్తోందయ్యా అని అత్యంత దీనంగా అడిగిన ఓ 22 ఏళ్ల ఓ యువతిపై అంబులెన్స్ డ్రైవర్..తన స్నేహిడితో కలిసి అత్యాచారానికి తెగబడ్డాడు. ప్రాణాలు పోసే అంబులెన్స్ లోనే ఆకలితో అలమటించిపోయే యువతిపై అత్యాచారానిరి తెగబడ్డాడు అంబులెన్స్ డ్రైవర్. తన స్నేహితుడితో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆకలేస్తోందని అడిగిన ఆమెను ఆహారం ఇస్తామని ఆశపెట్టి అంబులెన్స్ లోకి ఎక్కించి..తరువాత ఆ అంబులెన్స్ ను ఓ నిర్మానిష్య ప్రాంతానికి తీసుకెళ్లి తమ కామవాంఛ తీర్చుకున్నారు.

ఈ ఘటన తరువాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసు అధికారి సురేంద్ర పంచోలి మాట్లాడుతూ..సోమవారం (మే 24,2021)న వివాహిత అయిన బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామని తెలిపారు. నిందితులపై సామూహిక అత్యాచారంతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశామని తెలిపారు. అంబులెన్స్ డ్రైవర్ ని, అతని స్నేహితుడిని అరెస్ట్ చేశామని..కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాధితురాలి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశామని, ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు కూడా చేయించామని..ఇద్దరు అత్యాచారం చేసినట్లుగా తేలిందని తెలిపారు.