Oxygen As Dowry : అల్లుడికి క‌ట్నంగా ఆక్సిజ‌న్ ఇచ్చిన మామ! దటీజ్ కరోనా టైమ్

కూతురు పెళ్లిచేసిన తండ్రి కట్నంగా ఇళ్లు, పొలాలు, తోటలు,బంగారం,వెండి ఇస్తారు. కానీ ఇది కరోనా మహమ్మారి టైమ్ అన్ని వింతలే అన్నీ విచిత్రాలే. ఓ తండ్రి కూతురుకి పెళ్లి చేసి అల్లుడికి ఆక్సిజన్ ను కట్నంగా ఇచ్చాడు.

Oxygen As Dowry : అల్లుడికి క‌ట్నంగా ఆక్సిజ‌న్ ఇచ్చిన మామ! దటీజ్ కరోనా టైమ్

Oxygen As Dowry To Sun In Law

Oxygen as dowry to Sun in Law : ఈ కోనా మహమ్మారి రోజుల్లో అన్ని చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కాలంలో జరిగే పెళ్లిళ్లు వింత వింతగా జరుగుతున్నాయి. కొన్నిపెళ్లిళ్లు మానతా దృక్పథంతో జరుగుతుంటే మరికొన్ని చిత్రంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలో కూతురు పెళ్లిచేసిన తండ్రి కట్నంగా ఇళ్లు, పొలాలు, తోటలు,బంగారం,వెండి ఇస్తారు. కానీ ఇది కరోనా మహమ్మారి టైమ్ అన్ని వింతలే అన్నీ విచిత్రాలే. పెళ్లిళ్లు జరుగే పద్ధతిలో వింతలు చోటుచేసుకుంటుంటే ఓ తండ్రి అల్లుడికి కట్నంగా ఇచ్చినదేంటో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.

ఇది కలికాలం అమ్మా అనటం కాదు ఇది కరోనా కాలం అమ్మా ఇలాంటి విచిత్రాలే జరుగుతాయి అనుకుంటాం. ఇంతకీ ఆ వరకట్నం ఏంటంటే..‘ఆక్సిజన్’ను కట్నండా ఇచ్చాడు. ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్లు ను వరుడికి కట్నంగా ఇచ్చాడు వధువు తండ్రి.మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ వింత కట్నానికి సంబంధించిన ఫోటోలో సోషల్ మీడియాలో వైలర్ గా మారాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఉజ్జ‌యిని ప్రాంతానికి చెందిన సుధీర్ గోయ‌ల్. అతని కూతురికి ఇటీవల వివాహం చేశారు. అంగరంగవైభోగంగా జరిగిన ఈ పెళ్లిలో సుధీర్ గోయల్ తన అల్లుడికి కట్నంగా ఇచ్చిన ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్లు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పెళ్లి వేదికపై కూతురు, అల్లుడి చేతికి ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్లును అందజేశారు సుధీర్ గోయల్. ఉజ్జ‌యినికి చెందిన సుధీర్ గోయ‌ల్ ఓ ఆశ్ర‌మాన్ని స్థాపించారు.దాని పేరు సేవాధామ్.

ఆ ఆశ్ర‌మం ద్వారా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తుంటారు. తన కూతురు వివాహ వేడుక‌ను కూడా సేవా కార్య‌క్ర‌మానికి వేదిక‌గా మార్చాల‌నుకున్నారు.అల్లుడికి కట్నంగా ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్‌ల‌ను వ‌ర‌క‌ట్నంగా ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్‌ల‌ను క‌ట్నంగా అందుకున్న వధూవ‌రులు.. వాటిని అవ‌స‌ర‌మైన వారికి ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సుధీర్ గోయ‌ల్ మాట్లాడుతూ..మా అల్లుడికి నేను 8 హామీలు ఇచ్చాన‌ని..వాటిలో భాగంగానే రెండు ఆక్సిజ‌న్ కాన్సన్‌ట్రేట‌ర్‌లు ఇచ్చానని తెలిపారు.