Village Boycott : వ్యాక్సిన్ వేసుకోనివారికి గ్రామ బ‌హిష్క‌ర‌ణ‌..13 గ్రామాల నిర్ణయం

కరోనా వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఇప్పటికీ చాలామంది ఆసక్తి చూపించటంలేదు. దీంతో వ్యాక్సిన్ వేయించుకోనివారిని గ్రామం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు మధ్యప్రదేశ్ లోని 13 గ్రామాలకు చెంది పెద్దలు. వ్యాక్సిన్ వేయించుకోకపోతే గ్రామం నుంచి బహిష్కరిస్తామని వారిని ఆయా గ్రామాల్లో జరిగిన ఏ కార్యక్రమాలకు రానివ్వమని తేల్చి చెప్పారు.

Village Boycott : వ్యాక్సిన్ వేసుకోనివారికి  గ్రామ బ‌హిష్క‌ర‌ణ‌..13 గ్రామాల నిర్ణయం

Villafe Boycott

Madhya pradesh Village Boycott : కరోనా వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఇప్పటికీ చాలామంది ఆసక్తి చూపించటంలేదు. ముఖ్యంగా కొన్ని మారు మూల గ్రామాలు వ్యాక్సిన్ అంటేనే ఆమడదూరం పారిపోతున్నారు.ఈక్రమంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో కొన్ని గ్రామ‌పంచాయ‌తీలు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందేనంటూ హుకుం జారీ చేశాయి. అంతేకాదు వ్యాక్సిన్ వేయించుకోనివారిని గ్రామం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. దీనికి సంబంది డిక్రీని కూడా పాస్ చేశారు.మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు చెందిన 4 పంచాయతీలలోని 13 గ్రామాలు ఈ నిర్ణ‌యం తీసుకున్నాయి. వ్యాక్సిన్ వేయించుకోకపోతే గ్రామం నుంచి బహిష్కరిస్తామని వారిని ఆయా గ్రామాల్లో జరిగిన ఏ కార్యక్రమాలకు రానివ్వమని తేల్చి చెప్పారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటానికే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాయి ఆ 13 గ్రామ సర్పంచ్ లు తెలిపారు.

ఈ 13 గ్రామాలకు చెందిన ప్రజలంతా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు.ఎవ్వరైతే వేయించుకోరో..వారికి గ్రామబ‌హిష్క‌ర‌ణ విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. ఎవ్వరైతే టీకా వేయించుకోరో..వారిని ఎవ్వరూ వారి ఇళ్లకు రానివ్వవద్దని..వారి ఇంటికి ఎవ్వరూ వెళ్లవద్దని డిక్రీ జారీ చేశారు. ఈ క‌ఠిన డిక్రీని రతిబాద్, సర్వార్, సికింద్రాబాద్, ముండ్ల పంచాయ‌తీల ప‌రిధిలోని 13 గ్రామ పెద్ద‌లు నిర్ణ‌యం తీసుకున్నారు.

గ్రామాలు చిన్న చిన్నవే అయినా వ్యాక్సిన విషయంలో మాత్రం కఠిన నిర్ణయం తీసుకున్నారు పెద్దలు. ఆ 13 గ్రామాల జనాభా దాదాపు 17 వేలుగా ఉంటుంది. వీరిలో ఇప్పటివరకు 5 వేల మందికి పైగా టీకా వేయించుకున్నారు. కానీ చాలామంది వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఇష్టపడట్లేదు. పైగా వేయించుకోం అని కచ్చితంగా చెబుతున్నారు.దీంతో గ్రామ పెద్దలు ఇటువంటి కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ వ్యాక్సిన్ వేయించుకోనివారికి రెండురోజుల్లో వేయించేలా ఏర్పాట్లు చేస్తున్నామని కాబట్టి..వేయించుకోనివారంతా కచ్చితంగా టీకా వేయించుకోవాలని ప్రకటించారు. అలాగే వ్యాక్సిన్ వేయించుకుంటే ఏదో జరిగిపోతుందని అపోహకు పడవద్దని..వ్యాక్సిన్‌ వేయించుకోవటం ఎంతమంచిది అనే విషయంపై అవగాహనకల్పిస్తున్నారు.

దీనిపై సర్వార్ పంచాయితీ సర్పంచ్ లాల్ సింగ్ మీనా మాట్లాడుతూ..గ్రామ బహిష్కరణ అనే ప్రకటనకు మంచి స్పందన కూడా వచ్చింది. ఇప్పటి వరకూ వేయించుకోం అని చెప్పినవారంతా ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవటానికి వస్తున్నారని తెలిపారు. అంతేకాదు ఇంతకు ముందు వ్యాక్సిన్ వేయటానికి వైద్య సిబ్బంది వస్తే చాలామంది పారిపోయేవారు. వేరే గ్రామాలకు ఏదో పని ఉన్నట్లుగా వెళ్లిపోయేవారు. ఆడవాళ్లు ఇళ్లలోనే ఉండి తలుపులు వేసేసుకునేవారు అని తెలిపారు. కొంతమంది మతపెద్దలు కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే చనిపోతారని..పిల్లలు పుట్టరని కొంతమంది ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. దీంతో వ్యాక్సిన్ అంటేనే భయపడిపోతున్నారనీ..కానీ మేం మా గ్రామంలో వ్యాక్సిన్ – సేవ్ లైవ్స్ ప్రచారాన్ని ప్రారంభించామ‌ని దీంతో ప్రజల్లో అవగాహన పెరిగి వ్యాక్సిన్ వేయించుకోవటానికి ముందుకొస్తున్నారని తెలిపారు లాల్ సింగ్ మీనా.