న్యాయవాదివేనా సిగ్గులేదా? : లాయర్ కు రూ.5లక్షలు జరిమానా వేసిన హైకోర్టు

  • Published By: nagamani ,Published On : October 13, 2020 / 03:46 PM IST
న్యాయవాదివేనా సిగ్గులేదా? : లాయర్ కు రూ.5లక్షలు జరిమానా వేసిన హైకోర్టు

madras Highcourt:సంచలన తీర్పులకు వేదికైన మద్రాస్ హైకోర్టు మరో సంచలనం తీర్పు ఇచ్చింది. ఓ న్యాయవాదికి సోమవారం (అక్టోబర్ 12,2020) ఏకంగా..రూ. 5 లక్షల జరిమానా విధించింది. హైకోర్టులో విజిలెన్స్ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న ఆర్ పూర్ణిమపై లాయర్ బి. సతీశ్ కుమార్‌ అసత్య ఆరోపణలు చేయటంతో అవి అవాస్తవాలని తేలటంతో ధర్మాసం సతీశ్ కు రూ.5లక్షలు జరిమానా విధిస్తు..ఈ మొత్తాన్ని 15 రోజుల్లో చెల్లించాలని సంచలన తీర్పునిచ్చింది.



వివరాల్లోకి వెళితే.. హైకోర్టులో విజిలెన్స్ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న ఆర్ పూర్ణిమ ఇంటర్మీడియట్ పరీక్షలు రాయకుండానే ఓపెన్ యూనివర్శిటీలో డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత మైసూరు యూనివర్శిటీలో లా డిగ్రీ పొందారని..కాబట్టి ఆమె విజిలెన్స్ రిజిస్ట్రార్‌ విధులు నిర్వహించే అర్హత లేదని ఆమెను విధుల నుంచి తొలగించాలని పిటిషన్ లాయర్ సతీశ్ కుమార్ ఆరోపిస్తూ పిటీషన్ వేశాడు.


దీనిపై ఏపీ సాహి నేతృత్వంలోని ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. ఆ విచాణలో పూర్ణిమ తన చదువుకు సంబంధించి అన్ని ఆధారాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తాను 1984లో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో 711 మార్కులతో ఫస్ట్ ర్యాంకులో ప్యాస్ అయ్యానని దానికి సంబంధించిన మార్కుల లిస్టును న్యాయమూర్తికి సమర్పించారు.



ఆ సర్టిఫికెట్లను న్యాయమూర్తి లాయర్ సతీష్ కుమార్‌కు చూపించారు. అనంతరం మహిళా ఉద్యోగిపై తప్పుడు ఆరోపణలతో పిటిషన్ వేసి..కోర్టు సమయాన్ని వృథా చేశారని న్యాయమూర్తి సాహి లాయర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయవాదిగా బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ఇటువంటి తప్పుడు ఆరోపలు చేయటానికి సిగ్గులేదా? అంటూ చీవాట్లు పెట్టింది ధర్మాసనం.




తీర్పులో భాగంగా లాయర్ సతీష్ కుమార్ రూ.5 లక్షల రూపాయల జరిమానాతో పాటు కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఈ నెల అంటే అక్టోబర్ 20న విచారణకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేశారు.


జరిమానా మొత్తాన్ని 15 రోజుల్లోగా చెల్లించాలని ధర్మాసనం స్పష్టంచేసింది. 15 రోజుల్లోగా సతీష్ కుమార్ జరిమానా మొత్తాన్ని చెల్లించకపోతే జిల్లా కలెక్టర్ అతను నుంచి ఆ డబ్బుని వసూలు చేయాలని స్పష్టం చేసింది కోర్టు.