Madras HC : అమెరికాలో వరుడు..ఇండియాలో వధువు..ఇద్దరి సంతకాలు వధువే చేయొచ్చు..ఆ పెళ్లి చట్టబద్ధమే..

వరుడు అమెరికాలో ఉన్నాడు..వధువు ఇండియాలో ఉంది. ఇద్దరి సంతకాలు వధువే చేయొచ్చు అని సూచించింది మద్రాస్ హైకోర్టు. అలా చేసి చేసుకున్న వివాహం చట్టబద్ధం అవుతుంది అని కీలక తీర్పునిచ్చింది.

Madras HC : అమెరికాలో వరుడు..ఇండియాలో వధువు..ఇద్దరి సంతకాలు వధువే చేయొచ్చు..ఆ పెళ్లి చట్టబద్ధమే..

Bride In India To Marry Groom In U.s. Virtually, Courtesy Madras High Court

Madras HC : పరిస్థితులకు అనుగుణంగా వివాహాలు జరిగిపోతున్నాయి. అలాగే మారుతున్న పరిస్థితులను న్యాయస్థానాలు కూడా అర్థం చేసుకుంటున్నాయి. దానికి తగినట్లుగా సూచనలు ఇవ్వటమే కాకుండా చట్టాలను కూడా సర్ధుబాటు చేస్తున్నాయి. ఈక్రమంలో మద్రాస్ హైకోర్టు ఓ యువ జంట వివాహం విషయంలో కీలక తీర్పునిచ్చింది.రిజిస్ట్రార్ ఆఫీసుకు కీలక సూచనలు ఇచ్చింది. ఇటువంటి మార్పులను..తీర్పులను ఇచ్చే న్యాయస్థానాలు బాధితులకు న్యాయం జరగాలనే ఏకైక లక్ష్యంతో ఇటువంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. లైంగిక వేధింపులు, భార్యాభర్తల సంబంధాలు, కుటుంబసమస్యలు వంటి కేసుల్లో అసమాన తీర్పులు వెల్లడిస్తున్నాయి. ఈక్రమంలో ఇండియాలో ఉంటున్న యువతి పెళ్లికి అనుమతినిస్తూ..కీలక తీర్పునిచ్చింది మద్రాస్ హైకోర్టు.

వరుడు అమెరికాలో ఉన్నందున వధువే రిజిస్టర్ లో రెండు సంతకాలు (వరుడు సంతకం కూడా ఆమె చేయవచ్చు) చేయాలని సూచించింది. అంతే కాకుండా ఆ పెళ్లిని చట్టపరంగా పరిగణించాలని ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా మణవాళకురిచ్చి ప్రాంతానికి చెందిన వంశీ సుదర్శిని అనే యువతి..రాహుల్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. రాహుల్ అమెరికాకు వెళ్లగా సుదర్శిని ఇండియాలోనే ఉంది. రాహుల్ కొంత కాలానికి రాహుల్ ఇండియా వచ్చాడు. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి వివాహానికి మణవాళకురిచ్చి రిజిస్ఱ్రార్ నిరాకరించారు. దీంతో సుదర్శిని, రాహుల్ షాక్ అయ్యారు. ఎందుకు మా వివాహానికి అనుమతి లేదో కారణం చెప్పాలని కోరారు. రిజిస్ట్రార్ ఆఫీసర్ సరైన కారణం చెప్పలేదు. కానీ ఈలోపే రాహుల్ వీసా గడువు ముగియడంతో అమెరికా వెళ్లిపోయాడు.

ఈ క్రమంలో వారిద్దరూ వీడియో కాన్ఫరెన్సులో పెళ్లి చేసుకునేందుకు అనుమతివ్వాలని సుదర్శిని మద్రాస్ కోర్టును ఆశ్రయించింది. అంతేకాదు..మా వివాహాన్ని చట్టబద్ధం చేయాలని పిటిషన్ లో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌.. యువతీ యువకులు పెళ్లి చేసుకునేందుకు చట్టపరమైన అడ్డంకులేవీ లేవని తేల్చి చెప్పారు. వివాహ రిజిస్టర్ లో వధూవరుల సంతకాలు రెండూ వధువే చేయవచ్చని తీర్పు వెల్లడించింది. తద్వారా ఆ వివాహాన్ని చట్ట ప్రకారం నమోదు చేయాలని సంబంధిత రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.