Madurai High Court : దసరా ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలపై నిషేధం విధించిన మద్రాస్ హైకోర్టు

దసరా ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు, సినిమా పాటలపై నిషేధం విధించింది మద్రాస్ హైకోర్టు.

Madurai High Court :  దసరా ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలపై నిషేధం విధించిన మద్రాస్ హైకోర్టు

Madurai High Court orders ban on dance performance

Madurai High Court orders ban on dance performance : దసరా ఉత్సవాల పేరుతో భక్తి గీతాలు కాకుండా అశ్లీల నృత్యాలు, సినిమా పాటలతో హోరెత్తిస్తుంటారు ఉత్సవాల నిర్వాహకులు. ఇకపై అటువంటివి కుదరదని తేల్చి చెప్పింది మద్రాస్ హైకోర్టు. దసరా ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు..సినిమా పాటలపై నిషేధం విధించింది. దసరా ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు, సినిమా పాటలను నిషేధించాలి అంటూ ఓ సామాజకి కార్యకర్త దాఖలు చేసిన పిటీషన్ పై విచరణ చేపట్టిన ధర్మాసనం వాటిని నిషేధించాలని ఆదేశాలు జారీ చేసింది. దేవుళ్ల పేరుతో ఇటువంటి అశ్లీల కార్యక్రమాలు నిర్వహించటం ఏంటీ అంటూ ప్రశ్నించింది. పవిత్ర ఉత్సవాల్లో భక్తి గీతాలకే పెద్దపీట వేయాలని సూచించింది.

కాగా..తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. స్థానికంగా ముత్తాలమ్మన్ ఆలయంలో నిర్వహించే నవరాత్రుల సందర్భంగా అశ్లీల నృత్యాలు ప్రదర్శనలు, సినిమా పాటలు హోరెత్తిస్తుంటారు నిర్వాహకులు. భక్తి కీర్తనలు వినిపించాల్సిన ఉత్సవాల్లో సినిమాలు..పైగా అర్థనగ్నం నృత్యాలు ఉండకూడదని భావించని సామాజిక కార్యకర్త రాంకుమార్ ఆదిత్యన్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఉత్సవాల పేరిట జరుగుతున్న ఈ అశ్లీల నృత్యాలను ఆపాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

జస్టిస్ మహాదేవన్, జస్టిస్ సత్యనారాయణ ప్రసాద్‌లతో కూడిన బెంచ్ బుధవారం (సెప్టెంబర్ 14,2022) ఈ పిటిషన్‌ను విచారించింది. వాదనల అనంతరం ఒక్క దసరా ఉత్సవాల్లోనే కాకుండా ఇకపై ఏ ఆలయ వేడుకల్లోనూ అశ్లీల నృత్యాలు, సినిమా పాటలు పెట్టకూడదని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.