Maggi Milkshake: ‘మ్యాగీ మిల్క్‌షేక్’ వింత వంటకంపై..నెట్టింట్లో తిట్ల దండకం

మ్యాగీ మిల్క్ షేక్ అనే వింతైన వంటకం నెట్టింటో వైరల్ గా మారింది. టేస్టీ టేస్టీ మ్యాగీ కాస్తా వెరైటీ కాంబినేషన్ లో నెట్టింట్లో ప్రత్యక్షమయ్యేసరికి మ్యాగీ ప్రియులు షేక్ అవుతున్నారు.

Maggi Milkshake: ‘మ్యాగీ మిల్క్‌షేక్’ వింత వంటకంపై..నెట్టింట్లో తిట్ల దండకం

Maggi Milkshake

Maggi Milkshake: మ్యాగీ. వండటానికి టూ మినిట్స్. ప్లేటులో పెడితే ఒక్క నిమిషంలో ఖాళీ. అద్దరగొట్టే టేస్టు మ్యాగీ నూడుల్స్ స్పెషల్. చిన్నారుల నుంచి పెద్ద వారి వరకు మ్యాగీ నూడుల్స్ అంటే ఇష్టపడనివారుండరు. అమ్మా ఆకలేస్తోందని చిన్నారులు అడిగితే ‘ టూ మినిట్స్ బంగారం’ అంటూ అమ్మలు పెట్టే మ్యాగీ నూడుల్స్ పెడితే లొట్టలేసుకుంటు లాగించేస్తారు పిల్లలు.

Read more :Viral Video: డిఫరెంట్ గులాబ్ జామున్.. నోట్లో వేసుకుంటే మత్తులో తూగాల్సిందే!

అటువంటి మ్యాగీని వారి వారి రుచులను బట్టి తయారు చేసుకుని తింటుంటారు మ్యాగీ ప్రియులు.కొంతమంది సింపుల్‌ న్యూడుల్స్‌గా చేసుకుంటే..మరికొందరు సూప్‌గా, ఇంకొందరు ఎగ్‌ న్యూడుల్స్‌గా.. ఇలా చాలా రకాలుగా చేసుకుని తింటారు. కానీ ఎవరు చేశారో గానీ మ్యాగీ నూడుల్స్ తో వింత ప్రయోగాలు చేసి దాన్ని నెట్టింట్లో పెట్టేసరికి నెటిజన్లు మండిపడిపోతున్నారు. ఆ వింత వంటానికి ‘మ్యాగీ మిల్క్ షేక్’ అని పేరు కూడా పెట్టాడు.దీంతో నెటిజన్లుకు కోపం మామూలుగా రాలేదు.ఇంతకీ ఈ మ్యాగీ నూడుల్స్ తో రొటీన్‌ గా చేయటం ఎందుకు కాస్త డిఫరంట్‌గా ట్రై చేద్దామనుకున్నాడో గానీ..‘‘మ్యాగీ న్యూడుల్స్‌ను మిల్క్‌షేక్‌’’ కాంబినేషన్‌ కలిపి తయారు చేశాడు.

Read more : ఎమ్మెల్యేగారూ..నాకొక గర్ల్‌ఫ్రెండ్‌ కావాలి..చూసిపెట్టండి సార్…

ప్రస్తుతం ఈ విచిత్ర పుడ్‌ కాంబినేషన్‌ ఫోటో నెట్టింట వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. మ్యాగీ ప్రేమికులంతా ఈ ఫోటోపై వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ఓ పక్క మ్యాగీపై ఉన్న ప్రేమ కనిపిస్తుంటే..మరో పక్క ఈ వింత వంటకపై కారాలు మిరియాలు నూరుతు ఓ నెటిజన్ ‘ఈ ఫోటో నాకూ వచ్చింది. మ్యాగీ మిల్క్‌ షేక్‌.. ఇది ఎవడు చేశాడో గానీ వాడు దొరకాలి నా అని’ అంటే మరొకరు ‘ఎక్కడ నుంచి వస్తార్రా బాబు‘ ఇలాంటోళ్లంతా అంటే..ఇంకొకరు కాస్త డోసు పెంచు ‘నోరూరించే మ్యాగీకి ఈ గతి పట్టించినవాడిని చంపేస్తా’ అంటూ కోపాన్నంతా వెళ్లగక్కాడు. ఇంకొకరు మ్యాగీని ఇలా చూశాను దీన్ని తినలేను..తాగలేను అన్నారు. ఇలా ఎవరి తోచిన కామెంట్లు వారు చేస్తు నెట్టింటో ఈ మ్యాగీ మిల్క్ షేక్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు.