కళ్లు తిప్పుకోనివ్వని వీడియో : మ్యాజిక్ చేస్తున్న మేఘాల సోయగం

  • Published By: veegamteam ,Published On : November 27, 2019 / 04:22 AM IST
కళ్లు తిప్పుకోనివ్వని వీడియో : మ్యాజిక్ చేస్తున్న మేఘాల సోయగం

ప్రకృతిలో వింతలకు..అందాలకు కొదవలేదు. అటువంటిదే ఈ అరుదైన..అత్యద్భుతమైన వీడియో. దీన్ని చూస్తే..మీకు ఏమనిపిస్తుంది? వారెవ్వా..ఏమీ ఈ  వాటర్ ఫాల్ అందం అనిపిస్తుంది కదూ. కానీ అది వాటర్ ఫాల్ కాదు..మేఘాలు..!! ఏం కాదు అది వాటర్ ఫాలే అని అనుకుంటే మీరు పప్పులో కలేసినట్లే. అది వాటర్ ఫాల్ కానే కాదు మేఘాల సోయగం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కళ్లార్పకుండా చూడగలిగే అద్భుతం ఈ మేఘాల అందం. మనసును  హత్తుకునే ఈ అద్భుత దృశ్యం మరెక్కడో కాదు.. ఇండియాలోని ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలోని ఆయిజోల్‌లో కనిపించింది. కనువిందు చేసింది. మైమరిపింపజేసింది. 

ఈ అరుదైన వీడియోను అజీజ్ బర్భుయా అనే వ్యక్తి ఫేస్‌బుక్ యూజర్ పోస్టు చేశాడు. పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్‌గా మారింది. 4 లక్షల మందికి పైగా నెటిజనుల మనసు దోచుకుంది ఈ మేఘాల సోయగం. 11 వేల మందికి పైగా ఈ వీడియోను షేర్ చేసుకున్నారు. ఆ వీడియోను మీరు కూడా చూడండి.

ఆ..అన్నట్లు..ఈ మేఘాలు ఇలా ఎందుకు కనిపిస్తున్నాయి అనే వింత గురించి కూడా తెలుసుకోండి..జలపాతాన్ని తలపిస్తున్న ఈ మేఘాలను ‘ఓరోగ్రాఫిక్ క్లౌడ్స్’ అంటారు. భూమిపై ఉండే గాలి ఒత్తిడి మేరకు మేఘాలు అలా కొండల మీద నుంచి దిగువకు ప్రహిస్తున్నట్లుగా కదులుతుంటాయట. పర్వతాలకు ఒక వైపు ఉండే గాలి మేఘాలపై ఒత్తిడి తెచ్చి..వాటిని ముందుకు నెట్టడం, కొండలకు ఇవతలి వైపు ఉండే గాలి ఆ మేఘాలను కిందివైపుకి ఒత్తిడి కలిగించటంతో మేఘాలు అలా కొండలను అనుకుంటు కిందికి ప్రయాణిస్తాయి. ఇది సంఘటనలు చాలా చాలా అరుదుగా జరుగుతుంటాయి.

ఈ వీడియోను జాగ్రత్తగా పరిశీలించి చూస్తే.. ఒక వైపు మాత్రమే మేఘాలు అలా కిందికి దిగడం కనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ మేఘమాల వాటర్ ఫాల్ ను తలపించేలా కనిపించి కనువిందు చేస్తోంది. ఏది ఏమైనా ప్రకృతి అందమైనద కాదు.. భలే చిత్రమైనది అని అనిపించకమానదు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ  మేఘమాల వయ్యారాన్ని..సోయగాన్ని తనివితీరా ఆస్వాదించండి.