Earthquake : అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.0 గా నమోదు

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0 గా నమోదు అయింది. నికోబార్ దీవుల రీజియన్ లో సోమవారం ఉదయం 5 గంటలకు కొద్ది సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంపాన్ని నేషనల్ సెంట్ ఫర్ సిస్మోలజీ ధృవీకరించింది.

Earthquake : అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.0 గా నమోదు

earthquake (1)

Earthquake : వరుస భూకంపాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గత కొన్నిరోజులుగా వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. టర్కీ, సిరియాలో భూకంపాలు సంభవించిన తర్వాత పలు చోట్ల రోజులు, గంటల వ్యవధిలోనే భూప్రకంపనలు సంభవించాయి. తాజాగా అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0 గా నమోదు అయింది.

నికోబార్ దీవుల రీజియన్ లో సోమవారం ఉదయం 5 గంటలకు కొద్ది సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంపాన్ని నేషనల్ సెంట్ ఫర్ సిస్మోలజీ ధృవీకరించింది. నికోబార్ దీవుల్లోని పెర్కాకు 208 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్ర ఉందని తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలో మీటర్ల లోతులో ప్రకంపనలు చోటు చేసుకున్నాయని వెల్లడించింది. దీని ప్రభావంతో ఇండోనేషియాలో కూడా భూకంపం వచ్చిందని పేర్కొంది.

Earthquake : మణిపూర్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.2గా నమోదు

ఆదివారం ఉత్తరకాశీలో వరుసగా మూడు సార్లు భూమి కంపించింది. రెండు సార్లు 5 తీవ్రతతో భూకంపం వచ్చిందని ఎన్సీఎస్ తెలిపింది. భట్వారీ ప్రాంతంలోని సిరోల్ అడవిలో తొలుత తెల్లవారుజామున 12.40 గంటలకు భూమి కంపించిందని, తర్వాత 12.45 గంటలకు రెండో సారి, అనంతరం 1.05 గంటలకు మూడోసారి భూకంపం సంభవించినట్లు జిల్లా డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారి దడ్ద్ర పత్వాల్ పేర్కొన్నారు.

జమ్మూకాశ్మీర్ లో కూడా భూకంపం సంభవించింది. శ్రీనగర్ జిల్లాలో ఆదివారం ఉదయం 6.57 గంటలకు భూకంపం వచ్చిందని ఎన్సీఎస్ వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.9గా నమోదు అయింది. శ్రీనగర్ కు 38 కిలోమీటర్ల దూరంలో భూ అంతర్భాగంలో 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది.