మలక్‌పేట మార్కెట్‌లో మహా కరోనా.. వ్యాపారస్థుల్లో టెన్షన్..

మలక్‌పేట మార్కెట్‌లో మహా కరోనా.. వ్యాపారస్థుల్లో టెన్షన్..

Maha Covid Threat At Malakpet Market

కరోనా కేసుల్లో మొదటి నుంచి దేశంలో అగ్రస్థానంలో ఉన్న మహారాష్ట్ర కారణంగా తెలంగాణలోని మలక్ పేట్ మార్కెట్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మహాలో కోవిడ్-19 కేసులు రోజురోజుకు పెరుగుతుండగా.. హైదరాబాద్‌లోని మలక్‌పేట్ ఉల్లి మార్కెట్లో టెన్షన్ పడుతున్నారు వ్యాపారస్థులు. మహారాష్ట్ర నుండి ప్రతీరోజూ ఉల్లి స్టాక్ ట్రక్కుల్లో వస్తుంటుంది. దేశంలా మరెక్కడా లేనంతా మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం రేపుతోంది. ప్రతి రోజు 40వేలకుపైగా కొత్త కేసులు నమోదువున్నాయి.

ముఖ్యంగా.. ముంబై మాత్రమే కాదు.. పుణె, థానే, నాసిక్, నాగ్‌పూర్, ఔరంగాబాద్‌లోనూ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మలక్‌పేటలోని ఉల్లి మార్కెట్‌కు మహారాష్ట్ర నుంచి ప్రతి రోజూ ట్రక్కుల్లో ఉల్లి లోడ్ వస్తుండగా.. నిత్యం హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారు వ్యాపారస్థులు. హైదరాబాద్‌లోని మలక్‌పేట ఉల్లి మార్కెట్‌లో అధికారులు కరోనా జాగ్రత్తలు తీసుకోకపోవడంతో.. మహారాష్ట్ర నుంచి ట్రక్కుల్లో వచ్చే డ్రైవర్లు, హెల్పర్లకు కనీసం స్క్రీనింగ్ కూడా చేయకపోవడంతో పరిస్థితులు దారుణంగా కనిపిస్తున్నాయి.

మలక్‌పేట మార్కెట్లో ప్రతి ఒక్కరూ బహిరంగ ప్రదేశాల్లో ముసుగులు ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, కొద్దిమంది వ్యక్తులు మాత్రమే మార్కెట్లో ముసుగులు ధరించి కనిపిస్తున్నారు. మలక్‌పేట మార్కెట్లో ప్రతి వారం 200 ట్రక్కులు మహారాష్ట్ర నుండి వస్తున్నాయి, కర్ణాటక నుండి కూడా చాలా ట్రక్కులు వస్తున్నాయి, ఇవి పెరుగుతున్న కోవిడ్ -19 కేసులను కూడా పెంచుతాయని అభిప్రాయపడుతున్నారు.

మహారాష్ట్ర నుంచి వచ్చిన డ్రైవర్లు, క్లీనర్లు రాత్రి 10 గంటల వరకు మలక్‌పేట ప్రాంతంలోనే తిరుగుతున్నారు. తమ పని పూర్తైన తర్వాత మళ్లీ మహారాష్ట్రకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో వారంతా మహారాష్ట్ర నుంచి మలక్‌పేటకు కరోనా వైరస్‌ను మోసుకొస్తున్నారేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలోని సతారా, నాసిక్, జల్గావ్, పూణే, సోలాపూర్ మరియు అహ్మద్ నగర్ జిల్లాల నుండి ఎక్కువ ఉల్లి సరుకులు మలక్‌పేట్ మార్కెట్ వద్దకు వస్తాయి. దేశంలో మూడవ స్థానంలో కోవిడ్ -19 కేసులున్న కర్ణాటక సరిహద్దు ప్రాంతాల విషయంలో కూడా ఇదే పరిస్థితి.