త్వరలో ముంబైలో పాక్షిక లాక్ డౌన్!

పరిస్థితి అదుపులోకి రాకపోతే..ముంబైలో మరోసారి లాక్ డౌన్ విధించేందుకు సర్కార్ సిద్ధమౌతోంది. అయితే..ఈసారి పాక్షికంగా విధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

త్వరలో ముంబైలో పాక్షిక లాక్ డౌన్!

lockdown

lockdown : మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. భారతదేశంలో కూడా పలు రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రభుత్వాలు కఠిన నిబంధనలు, ఆంక్షలు విధిస్తున్నాయి. పరిస్థితులు అదుపులోకి రాకపోతే..మరిన్ని కఠినంగా ఆంక్షలు విధించాలని ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. ప్రధానంగా..మహారాష్ట్రలో అత్యధికంగా పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. కొత్త కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తమౌతోంది. పరిస్థితి అదుపులోకి రాకపోతే..ముంబైలో మరోసారి లాక్ డౌన్ విధించేందుకు సర్కార్ సిద్ధమౌతోంది. అయితే..ఈసారి పాక్షికంగా విధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ముంబై గార్డియన్ మినిస్టర్ అస్లాం షేక్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. మరో 8 రోజులు పరిస్థితులను సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆదివారం ఒక్కరోజే 11 వేల కేసులు నమోదయ్యాయి. తాజాగా ఎమ్మెల్యేలు, ఇతర సిబ్బందికి కరోనా టెస్టులు చెయ్యగా… 36 మందికి పాజిటివ్ అని తేలింది. ప్రజలు అవసరం ఉంటేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని, కరోనా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఇప్పటికే సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రజలకు సూచించారు కూడా. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు, ప్రజలు విధిగా మాస్కులు ధరించడంతో పాటు నిర్ణీత దూరం పాటించాలన్నారు.