#MeToo Protest: రెజ్లర్లకు మద్దతుగా రైతుల ఖాప్ మహా పంచయత్

భారతదేశంలో 365 ఖాప్‌లు ఉన్నాయి, మేము వారందరికీ ఫోన్‌, ఫేస్‌బుక్‌ ద్వారా తెలియజేశాము. పశ్చిమ యూపీ నుంచి మొత్తం 28 ఖాప్‌లు, అటువంటి బల్యాన్, దేశ్వాల్, రాఠీ, నిర్వాల్, పన్వర్, బెనివాల్ హుద్దా, లాటియన్, ఘాటియన్, అహ్లావత్ మొదలైనవారు ఈ పంచాయితీలో చేరతారు

#MeToo Protest: రెజ్లర్లకు మద్దతుగా రైతుల ఖాప్ మహా పంచయత్

Wrestlers Protest: భారత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‭కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు మద్దతుగా భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) గురువారం ఖాప్ మహా పంచయత్ ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‭నగర్ జిల్లా సౌరారం గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. రెజ్లర్ల కొనసాగుతున్న నిరసనకు సంబంధించిన సమస్యలను చర్చించి, దానికి సంబంధించిన వ్యూహాన్ని రూపొందించింది.

Massive Landslide: ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండ చరియలు.. చిక్కుకపోయిన 300 మంది ప్రయాణికులు

యూపీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, పంజాబ్ నుంచి ఖాప్, రైతు నాయకులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అయితే రెజ్లర్లకు మద్దతు చేపట్టిన ఈ మహా పంచాయత్‭కి రెజ్లర్లకు హాజరుకావడం లేదని సమాచారం. కాగా, ఈ విషయమై సర్వ్ ఖాప్ (ఖాప్‌ల ఐక్య సంఘం) కార్యదర్శి సుభాష్ బల్యాన్ మాట్లాడుతూ “భారతదేశంలో 365 ఖాప్‌లు ఉన్నాయి, మేము వారందరికీ ఫోన్‌, ఫేస్‌బుక్‌ ద్వారా తెలియజేశాము. పశ్చిమ యూపీ నుంచి మొత్తం 28 ఖాప్‌లు, అటువంటి బల్యాన్, దేశ్వాల్, రాఠీ, నిర్వాల్, పన్వర్, బెనివాల్ హుద్దా, లాటియన్, ఘాటియన్, అహ్లావత్ మొదలైనవారు ఈ పంచాయితీలో చేరతారు” అని అన్నారు.

Manipur violence: మణిపూర్ అల్లర్లపై కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ఇక బీకేయూ నేత నరేష్ తికాయత్ మాట్లాడుతూ “ప్రభుత్వం కోరుకుంటే, ఈ వివాదం వెంటనే ముగియవచ్చు. ఖాప్‌లు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, బీజేపీ ఎంపీ భూషణ్‌లను అరెస్టు చేయాలని కోరుకుతున్నాము. న్యాయస్థానం ఈ విషయంపై తక్షణం నిర్ణయం తీసుకోవాలి” అని అన్నారు.