Maha Vikas Aghadi : ప్రమాదంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం..శివసేన రెబెల్ క్యాంప్ లో పెరుగుతున్న ఎమ్మెల్యేలు

ఏక్ నాథ్ షిండే వెంట శివసేన సహా పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. మహా వికాస్ అఘాడీ నుంచి బయటకు రావాలని షిండే డిమాండ్ చేస్తున్నారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Maha Vikas Aghadi : ప్రమాదంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం..శివసేన రెబెల్ క్యాంప్ లో పెరుగుతున్న ఎమ్మెల్యేలు

Maha Vikas

Maha Vikas Aghadi : మ‌హారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ప్రమాదంలో పడింది. శివసేన రెబెల్ క్యాంప్ లో చేరుతున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. గుజరాత్ సూరత్ లో మ‌హారాష్ట్ర మంత్రి, సీనియర్ నేత ఏక్ నాథ్ షిండే వెంట 30కి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏక్ నాథ్ షిండే వెంట శివసేన సహా పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. మహా వికాస్ అఘాడీ నుంచి బయటకు రావాలని షిండే డిమాండ్ చేస్తున్నారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

షిండేతో చర్చలు జరిపేందుకు మంత్రి మిలింద్ నర్వేకర్ ను ఉద్ధవ్ ఠాక్రే సూరత్ పంపారు. సాయంత్రం 6 గంటలకు ఉద్ధవ్ ఠాక్రే ను అజిత్ పవార్ కలవనున్నారు. సాయంత్రం 7 గంటలకు ఉద్ధవ్ ఠాక్రే శివసేన శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నిర్వహించిన శివసేన శాసనసభా పక్ష సమావేశానికి కేవలం 18 మంది హాజరు అయ్యారు. కాగా, మహారాష్ట్రలో శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

Maharashtra: పార్టీ ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేస్తోన్న మంత్రి ఏక్‌నాథ్‌పై శివ‌సేన చ‌ర్య‌లు

మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని పడ‌గొట్టేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని ప్రచారం జరుగుతుండటంతో మ‌హారాష్ట్ర మంత్రి, సీనియర్ నేత ఏక్‌నాథ్ షిండేపై పార్టీ ప‌రంగా శివ‌సేన‌  చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ మేర‌కు శివ‌సేన పార్టీ ఓ ప్ర‌క‌ట‌న చేసింది. అలాగే, శివసేన‌ శాసనసభా పక్ష నేత హోదా నుంచి ఆయ‌న‌ను తొల‌గిస్తున్న‌ట్లు వెల్లడించింది. ఆ ప‌ద‌విలో శివ్‌డీ ఎమ్మెల్యే అజ‌య్ చౌద‌రిని నియ‌మిస్తున్న‌ట్లు పేర్కొంది.

కాగా, గుజ‌రాత్‌లోని ఓ హోట‌ల్‌లో దాదాపు 10 మంది పార్టీ ఎమ్మెల్యేల‌తో ఏక్‌నాథ్ షిండే క‌లిసి ఉన్న విషయం తెలిసిందే. కాసేప‌ట్లో ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించి కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్నట్లు తెలుస్తోంది. త‌నవైపు ఉన్న‌ ఎమ్మెల్యేల‌తో క‌లిసి మ‌హా వికాస్ అఘాడీ ప్ర‌భుత్వానికి ఆయ‌న‌ షాక్ ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే శివ‌సేన ఈ చ‌ర్య‌లు తీసుకుంది.