Maharashtra Politics: మహావికాస్ అఘాదిలో చేరడానికి ఎఐఎంఐఎం కసరత్తు: మూడు చక్రాల బండికి నాలుగో చక్రం

మహావికాస్ అఘాది ప్రభుత్వంలో తమ పార్టీ కలిస్తే మరో చక్రం జోడించబడి, సౌకర్యవంతమైన కారుగా ప్రభుత్వం సాగుతుందని ఎంపీ ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యానించారు

Maharashtra Politics: మహావికాస్ అఘాదిలో చేరడానికి ఎఐఎంఐఎం కసరత్తు: మూడు చక్రాల బండికి నాలుగో చక్రం

Shivsena

Maharashtra Politics: మహారాష్ట్రలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా మహా వికాస్ అఘాది కూటమిలో చేరాడానికి తాము ఆసక్తిగా ఉన్నామని ఎఐఎంఐఎం నేత ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ ప్రకటించారు. ఈ విషయాన్నీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు తెలియజేయాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి, ఎన్సీపీ నేత రాజేష్ తోపేకి విజ్ఞప్తి చేశారు ఇంతియాజ్ జలీల్. తాము కూటమిలో చేరితో ప్రస్తుతం మూడు చక్రాలతో ఆటోగా ఉన్న మహావికాస్ అఘాది ప్రభుత్వంలో తమ పార్టీ కలిస్తే మరో చక్రం జోడించబడి, సౌకర్యవంతమైన కారుగా ప్రభుత్వం సాగుతుందని ఎంపీ ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యానించారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన ఎఐఎంఐఎం పార్టీ..అక్కడ ఏ ఒక్క స్థానంలోనూ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. ఈక్రమంలో ఆపార్టీ నేత, ఎంపీ ఇంతియాజ్ జలీల్ మహారాష్ట్రలో అధికార కూటమిలో కలుస్తామంటూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Also Read: CM KCR : సీఎం కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్..ఈ వారంలోనే ఉద్యోగ నొటిఫికేషన్ ?

అయితే ఎంపీ ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యలపై శివసేన నేతలు సహా బీజేపీ నేతలు స్పందించారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈ విషయంపై శనివారం స్పందిస్తూ ఎఐఎంఐఎంను కూటమిలో చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎంపీ ఇంతియాజ్ ను వ్యక్తిగతంగా పలుమార్లు కలిశానని అయితే పార్టీతో పొత్తు గురించి ఎన్నడూ చర్చించలేదని సంజయ్ రౌత్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఏఐఎంఐఎంను బీజేపీ ‘బీ’ టీమ్‌గా మహారాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని అటువంటప్పుడు ఆపార్టీతో కలిసి సాగితే ఎటువంటి పరిణామాలు ఉంటాయో అందరికి తెలుస్తుందని ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. దీనిపై ఏఐఎంఐఎం ఎంపీ ఇంతియాజ్‌ జలీల్‌ మాట్లాడుతూ.. ‘యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌, ఎన్‌సీపీలతో పొత్తు పెట్టుకోవడానికి నేనే ప్రయత్నించాను. కానీ నాకు ఎలాంటి స్పందన రాలేదు. మీరు మమ్మల్ని బీజేపీ బి టీమ్ అని ఆరోపిస్తున్నారు, అందుకే మీతో రావాలని బాహాటంగా ప్రతిపాదిస్తున్నాను. ఇప్పుడు మేము ఆఫర్ చేసాము, మీ నిర్ణయం చెప్పండి” అని అన్నారు.

Also Read: Rahul Gandhi: ధరలను పెంచి బీజేపీ ప్రభుత్వం పేదలను దోచుకుంటుంది: రాహుల్ గాంధీ

మహా వికాస్ అఘాదిలో చేరాలనే ఏఐఎంఐఎం ప్రతిపాదనపై, బిజెపి నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. శనివారం ఆయన నాగపూర్లో మాట్లాడుతూ ‘వచ్చేవారెవరూ బిజెపిని ఓడించలేరు, అయినప్పటికీ మోదీపై ప్రజలకు విశ్వాసం ఉంది. మరి దీనిపై శివసేన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఏది ఏమైనా హిందూ హృదయ్ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రేకి చెందిన శివసేన ఇప్పుడు ‘జనబ్ శివసేన’గా మారింది. శివసేన ఇప్పుడు ఆజాన్ పోటీని కూడా నిర్వహించడం ప్రారంభించింది. మరి శివసేన ఎంత దూరం వెళ్తుందో చూడాలి” అని అన్నారు. ఇక ఈ విషయంపై శివసేన నేత, ఎమ్మెల్సీ అంబాదాస్ దన్వే మాట్లాడుతూ “వందేమాతరం” ఆలపనను వ్యతిరేకించి, రజాకార్ల ఆలోచనతో నడిచే పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదని అన్నారు.

Also Read: TRS And PK Team : సీఎం కేసీఆర్‌‌తో పని చేయడం లేదన్న ప్రశాంత్ కిశోర్