18 రోజుల్లోనే మహాభారతం గెలిచింది…కరోనా యుద్ధం 21 రోజులు : మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : March 25, 2020 / 12:27 PM IST
18 రోజుల్లోనే మహాభారతం గెలిచింది…కరోనా యుద్ధం 21 రోజులు : మోడీ

18 రోజుల్లో మహాభారతం గెలిచిందని,కానీ కరోనాపై మన యుద్ధం 21రోజులు తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా 21రోజులు(ఏప్రిల్-14వరకు)పూర్తి లాక్ డౌన్ ను మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగ సమయంలో ప్రధాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ(మార్చి-25,2020)తన నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్ లోని వారణాశి ప్రజలతో మోడీ వీడియో లింక్ ద్వారా మాట్లాడారు.

ప్రశ్న,సమాధానం సెషన్ ద్వారా ప్రసంగించారు మోడీ. పలువురు అడిగిన ప్రశ్నలకు మోడీ జవాబిచ్చారు. ఈ ఆపధ కాలంలో తెల్లటి కోటులో ఉన్నవారు దేవుని రూపం. ఈరోజు వాళ్లు ప్రాణాలను కాపాడుతున్నారన్నారు. ఢిల్లీలో ఎయిమ్స్ డాక్టర్లను,నర్సులను కరోనా భయంతో ఇళ్ల నుంచి ఓనర్లు వెళ్లగొట్టడం పట్ల తాను చాలా నిరుత్సాహపడ్డానని ఓ మహిళా డాక్టర్ చెప్పగా దానికి స్పందించిన మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. వూహాన్ సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి మన భారతీయులను క్షేమంగా తిరిగితీసుకొచ్చిన డాక్టర్లు,రెస్క్యూ వర్కర్లు,ఎయిర్ ఇండియా,ఇతర సిబ్బంది మన నిజమైన హీరోలు అని మోడీ అన్నారు.

మనం వారికి తప్పక సహాయం చేయాలన్నారు. వాళ్లు వేధించబడ్డారు అని తాను విన్నప్పుడు తాను ఆ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నానని మోడీ తెలిపారు. ఇది తనకు చాలా గంభీరమూన ఇష్యూ అని మోడీ తెలిపారు. వాళ్లను వేధించవారిపై చాలా కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల డీజీపీలకు చెప్పినట్లు మోడీ తెలిపారు. తాను మాములుగా అయితే వారణాసి వచ్చి ఉండాలని,కానీ కరోనా కారణాంగా రాలేకపోయానని మోడీ తెలిపారు.