బీహార్ మహాకూటమిలో కుదిరిన సీట్ల సర్దుబాటు

బీహార్ మహాకూటమిలో కుదిరిన సీట్ల సర్దుబాటు

బీహార్ మహాకూటమి మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది.శుక్రవారం(మార్చి-20,2019) ఆర్జేడీ నేత మనోజ్‌ ఝా సీట్ల సర్దుబాటుపై అధికారికంగా ప్రకటన చేశారు.రాష్ట్రంలోని మొత్తం 40లోక్ సభ నియోజకవర్గాల్లో ఆర్జేడీ 20 స్థానాల్లో కాంగ్రెస్ 9స్థానాల్లో,ఆర్ఎల్ఎస్ పీ 5స్థానాల్లో,హెచ్ ఏఎమ్5స్థానాల్లో,వీఐపీ 3స్థానాల్లో పోటీ చేయనున్నట్లు మనోజ్ ప్రకటించారు.ఆర్జేడీ కోటాలో సీపీఐఎమ్ఎల్‌ ఒక స్థానంలో పోటీ చేసే అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు.లోక్‌ తాంత్రిక్‌ జనతా దళ్‌ పార్టీ (ఎల్‌జేడీ) నేత శరద్‌ యాదవ్‌..ఆర్జేడీ ఎన్నికల గుర్తుతో పోటీ చేస్తారని,ఎన్నికల అనంతరం ఆయన పార్టీ తమ పార్టీలో విలీనం అవుతుందని మనోజ్‌ ప్రకటించారు. దేశ రాజ్యాంగాన్ని కాపాడేందుకే తమ మహాకూటమి పని చేస్తుందని ఆయన తెలిపారు.

అయితే కూటమిలో ఎటువంటి విభేధాలు లేకపోతే మీడియా ముందుకు ఆర్జేడీ నేత  తేజస్వీ యాదవ్‌ ఎందుకు రాలేదని మనోజ్‌ ను మీడియా ప్రశ్నించగా…మా పార్టీలో నాకు విలువ లేదా? మీరు నాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదా? చివరి నిమిషంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయంటే, ఇది పార్టీ తీసుకున్న నిర్ణయమే అని ఆయన సమాధానమిచ్చారు. మహాకూటమిలో విభేదాలు వచ్చాయని ఇటీవల ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.