Mumbai : టెన్షన్ పెట్టిన వడాపావ్..మురికి కాల‌వ‌లో ఎలుక‌ల నుంచి బంగారం స్వాధీనం

మురికి కాలువల్లో తిరిగే ఎలుకల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీనికి కారణం ఓ వడాపావ్.

Mumbai :  టెన్షన్ పెట్టిన వడాపావ్..మురికి కాల‌వ‌లో ఎలుక‌ల నుంచి బంగారం స్వాధీనం

Mumbai

Mumbai :  మురికి కాలువల్లో తిరిగే ఎలుకల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అదేంటో ఎలుకల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకోవటం ఏంటి? అని ఆశ్చర్యపోవచ్చు. నిజమే. అంటే ఎలుకలు బంగారాన్ని దొంగిలించాయా? అంటే అదీకాదు. ఒకోసారి మనం అనాలోచితంగా చేసే పనుల వల్ల కొన్ని ఘటనలు జరుగుతుంటాయి. అలా ఓ మహిళ చేసిన పొరపాటు కాస్తా బంగారం కాస్తా ఎలుకల బారిన పడింది. సీసీ టీవీ పరిశీలించిన పోలీసులు బంగారాన్ని నోట కరుచుకుని అటు ఇటు పరుగెడుతున్న ఎలుకలను చూసి వాటి వద్ద ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ వింత ఘటన ముంబైలో జరిగింది.

ముంబైలోని గోరెగావ్ లోని గోకుల్‌ధాం కాల‌నీలో ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల విలువైన ప‌ది తులాల బంగారాన్ని మురికి కాల‌వ‌లో ఎలుక‌ల నుంచి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.చెత్త కుండీ నుంచి కొన్ని ఎలుక‌లు జ్యూవెలరీ బ్యాగ్‌ను స‌మీపంలోని
డ్రైనేజ్‌లోకి తీసుకువెళుతున్న దృశ్యాల‌ను సీసీటీవీ ఫుటేజ్‌లో పోలీసులు గ‌మ‌నించ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగుచూసింది.

అసలు విషయం ఏమిటంటే..బ్యాంకులో బంగారు నగలను డిపాజిట్ చేసేందుకు వెళుతున్న 45 ఏళ్ల మ‌హిళ మార్గ‌మ‌ధ్య‌లో వ‌డ‌పావ్ ఉన్న క‌వ‌ర్‌ను ఓ చిన్నారికి ఇవ్వబోతు పొరపాటున పొర‌పాటున బంగారు ఆభ‌రణాలు ఉన్న క‌వ‌ర్‌ను ఇచ్చింది. తీరా బ్యాంక్‌కు వెళ్లి చూసిన త‌ర్వాత జ్యూవెల‌రీ ఉన్న బ్యాగ్‌ను ఇచ్చిన‌ట్టు గుర్తించి వెన‌క్కి రాగా చిన్నారి క‌నిపించ‌లేదు.

ఆపై మ‌హిళ ఫిర్యాదు చేయ‌డంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను  ప‌రిశీలించి జ్యూవెల‌రీ ఆచూకీ రాబ‌ట్టారు. ఎలుక‌ల నుంచి బంగారం స్వాధీనం చేసుకుని మ‌హిళ‌కు అప్ప‌గించామ‌ని స్ధానిక ఎస్ఐ జీ. గార్గే తెలిపారు.