Maharashtra : ఎప్పుడు నీళ్లలోనే ఉండాలా, వీధిలో మొసలి విహారం

వీధిలోకి వచ్చి రోడ్డు దాటుతున్న మొసలికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. భారీ వర్షాలు ఆ రాష్ట్రాన్ని అతాలకుతలం చేస్తున్నాయి. వీధులున్నీ నీట మునిగాయి.

Maharashtra : ఎప్పుడు నీళ్లలోనే ఉండాలా, వీధిలో మొసలి విహారం

Maha

A Crocodile Seen On The Road : ఎప్పుడు నీళ్లలోనే ఉండాలా ? అనుకున్నదో ఏమో ఓ మొసలి. వీధిలోకి వచ్చేసింది. ఎంచక్కా..అటూ ఇటూ తిరిగింది. క్రూరమైన జంతువుల్లో ఒకటైన మొసలి చూడగానే..భయంతో వణికిపోతాం. అక్కడి నుంచి పరుగెత్తుతాం. వీధిలోకి వచ్చి రోడ్డు దాటుతున్న మొసలికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలో ఎలాంటి వాతావరణం ఉందో అందరికీ తెలిసిందే. భారీ వర్షాలు ఆ రాష్ట్రాన్ని అతాలకుతలం చేస్తున్నాయి. వీధులున్నీ నీట మునిగాయి. ప్రాజెక్టులన్నీ నీటితో నిండిపోవడంతో గేట్లను ఎత్తి నీటిని కిందకు వదిలేస్తున్నారు. వరద ప్రవాహానికి నీటిలో ఉన్న జలచరాలు బయటకు వచ్చేస్తున్నాయి. పాములు, తేళ్లు, మొసళ్లు బయటకు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

Read More : NCPCR : 10 ఏళ్లకే 37.8 శాతం మందికి ఫేస్ బుక్ అకౌంట్, పరిశోధనలో విస్తుపోయే నిజాలు

ఇలాగే..సంగ్లీ జిల్లాలోని పలు గ్రామాల్లో భారీగా వరద నీరు చేరింది. వరదల్లో కొట్టుకొచ్చిన ఓ మొసలి వీధిలో దర్శనమిచ్చింది. వీధిలో రోడ్డు దాటుతున్న మొసలిని కొందరు సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఠీవీగా రోడ్డు దాటుతున్న ఆ మొసలికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో వరద ప్రళయానికి జన జీవనం అతలాకుతలం అయింది. గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. జనం చెల్లచెదురై పోయారు. ఆదివారం కాస్త తేరుకోవడంతో సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నాయి ఎన్డీఆర్‌ ఎఫ్ బృందాలు. అయితే వందలాది గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ప్రస్తుతం వరద నుంచి కొన్ని ప్రాంతాలు బయటపడుతున్నాయి. వరద తర్వాత పరిస్థితులు భయానకంగా మారాయి. ఆ గ్రామాలను చూసిన జనం ఇదివరకు తాము ఉన్న చోటేనా అని గుర్తుపట్టలేని స్థితికి వచ్చాయి.