Maharashtra : రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కొత్తేంకాదు..ఇలాంటివి సర్వసాధారణమే : వ్యవసాయశాఖా మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కొత్తేంకాదు..ఇలాంటివి ప్రతీ ఏటా జరుగుతూనే ఉంటాయి అంటూ అదో పెద్ద విషయం కాదంటూ వ్యవసాయశాఖా మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

Maharashtra : రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కొత్తేంకాదు..ఇలాంటివి సర్వసాధారణమే : వ్యవసాయశాఖా మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Maharashtra Agriculture Minister remark

Maharashtra : రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కొత్తేంకాదు..ఇలాంటివి ప్రతీ ఏటా జరుగుతూనే ఉంటాయి అంటూ అదో పెద్ద విషయం కాదంటూ ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రైతులు కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రాకపోవటంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి వేరే దారిలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులంటే రాజకీయ నాయకులకు ఎంత చులకన? రైతుల ఓట్లు కావాలి కానీ వారి కష్టాలు మాత్రం పట్టవు అనేదానికి మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు అద్దంపడుతున్నాయాని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మహారాష్ట్రలో ఉల్లి రైతులు సరైన గిట్టుబాటు ధర రాకపోవటంతో సంక్షోభంలో పడిపోయారు.అకాల వర్షాలు పంటల్ని ముంచెత్తగా మరోవైపు సహాయం చేయటానికి ప్రభుత్వాలు ముందుకు రాకపోవటంతో మహారాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న అత్యంత దారుణ ఘటన జరిగింది. ఈ ఘటనపై మంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నేత, వ్యవసాయ శాఖ మంత్రి అబ్దుల్ సత్తార్‌ మాట్లాడుతూ అదో పెద్ద విషయం కాదు ఇటువంటివి సర్వసాధారణమే అన్నట్లుగా చేసిన వ్యాఖ్యలు రైతులంటే వారికి ఎంతటి చులకన భావం ఉందో తెలుస్తోంది అంటూ విమర్శలు వస్తున్నాయి.

ఔరంగాబాద్ జిల్లాలోని సిల్లోడ్ నియోజకవర్గం ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్‌ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. సిల్లోడ్ నియోజకవర్గంలో అనేకమంది ఉల్లి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈక్రమంలో మార్చి 12న తన నియోజకవర్గం అయిన సిల్లోడ్ ను మంత్రి అబ్దుల్ పరిశీలించటానికి వచ్చారు. ఈసందర్భంగా మీడియా ప్రతినిథులు రైతుల ఆత్మహత్యల గురించి ప్రశ్నించగా మంత్రి మాట్లాడుతూ..‘రైతులు ఆత్మహత్య చేసుకోవటం అనేది ఎన్నో ఏళ్లుగా జరుగుతోంది ఇదేం కొత్త కాదు ఇది నా నియోజకవర్గంలోనే జరగలేదుగా..మహారాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో జరిగాయి..’అంటూ వ్యాఖ్యానించారు.

ఔరంగాబాద్‌ జిల్లాలోనే మరఠ్వాడా ప్రాంతంలో ఆరుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పంట పెట్టుబడుల కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించింది. మంత్రి ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించటానికి వెళ్లి ఇటువంటి వ్యాఖ్యలు చేయటంతో దుమారం రేగింది. ఈ సందర్భంగా మంత్రి అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ..రైతుల ఆత్మహత్యలపై విచారణ జరిపటానికి ఓ కమిటీ ఏర్పాటు చేశామని..కమిటీ నివేదికలు అందాక తగిన చర్యలుతీసుకుంటామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని..కేవలం ఒక్కరూపాయికే పంట బీమా కల్పిస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. సీఎం ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ లోనే రైతులకు రూ.6,000లు అందిస్తున్నామని తెలిపారు.

రైతులపై మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.వ్యవసాయ శాఖా మంత్రి అయి ఉండి పంటకు గిట్టుబాటు ధర కల్పించకుడా ఇటువంటి బాధ్యరాహిత్యంగా మాట్లాడటమేంటి? ఇంత బాధ్యతారాహిత్యమా? ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి నేతలు అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇది షిండే, దేవంద్రఫడ్నవీస్ ప్రభుత్వపు ఉదాసీనతకు ఉదాహరణ అంటూ విమర్శించారు. మంత్రి సత్తార్ కు ఇటువంటి వ్యాఖ్యలు చేయటం కొత్త కాదని అతని నైజమే అంటువంటిది అంటూ దుయ్యబట్టారు.

మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నేత అజిత్ పవార్ మాట్లాడుతూ రైతుల కష్టాలు మంత్రికి ఎగతాళిగా అనిపించాయని ఇది అంత్యంత దారుణమని విమర్శించారు. అన్నం పెట్టే రైతన్నల గురించి ఇంత చులకనగా మాట్లాడిన మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.