సన్నిలియోన్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన వధువు..ఫిదా అయిపోయిన వరుడు

  • Published By: nagamani ,Published On : December 5, 2020 / 04:51 PM IST
సన్నిలియోన్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన వధువు..ఫిదా అయిపోయిన వరుడు

Maharashtra bride sunny leone song dance : పెళ్లికూతురంటే సిగ్గుపడుతూ తలదించుకుని కూర్చునే రోజులు పోయాయి. ఇప్పటి పెళ్లిళ్లలో పెళ్లికూతుళ్లు సిగ్గు పడటం కాదు కదా..డ్యాన్సులు కూడా వేస్తున్నారు. డ్యాన్స్ చేస్తూ పెళ్లి మండపానికి వస్తున్నారు నేటి తరం వధువులు. అటువంటి ఓ పెళ్లికూతురు వేసిన స్టెప్పులకు పెళ్లికొడుకు కళ్లప్పగించి చూస్తుండిపోయాడు.



ఈనాటి యువతి తమ పెళ్లి ఎలా జరగాలో..ఎంత వెరైటీగా జరగాల్లో పక్కా ప్లాన్ వేసుకుంటున్నారు. వెడ్డింగ్ షూట్ లతో హోరెత్తిస్తున్నారు. పెళ్లి మండపానికి వధూవరులు ఎలా వస్తారా? అని అతిథులు ఇంట్రెస్టింగ్ గా వేచి చూస్తున్నారు. అలా పెళ్లికి హాజరైన అతిథులంతా వధువు కోసం ఎదురు చూస్తున్నారు. అల్రెడీ వరుడు వేదికపైనే ఉన్నాడు.



ఈక్రమంలో మహారాష్ట్రలో వధువు డ్యాన్స్ వేస్తూ వచ్చింది. అది అలాంటిలాంటి డ్యాన్స్ కాదు కుర్రకారును ఉర్రూతలూగించే ప్రముఖ బాలీవుడ్ నటి సన్నీలియోన్ పాటకు డ్యాన్స్ చేస్తూ వచ్చింది. సన్నిలియోన్ పాట ‘‘మేరే సైయాన్ సూపర్‌స్టార్ క్రేజీ’’ సాంగ్‌కు చిందులేసింది వధువు. మరాఠి సంప్రాదాయం ప్రకారం ముస్తాబైన వధువు.. కళ్లకు సన్ గ్లాసెస్ పెట్టి మండపంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీతోనే సన్నీలియోన్ సాంగ్‌కు చిందేస్తూ వేదిక వద్దకు చేరుకుంది.



దీంతో ఆ పెళ్లికి హాజరైన అతిథులంతా ఆమెనే చూస్తూ ఉండిపోయారు. చక్కటి చీరకట్టు, నగలు ధరించిన ఆమె రిథమిక్‌గా డ్యాన్స్ వేస్తూ..చక్కటి ఎక్స్‌ప్రెషన్స్‌ను పలికిస్తూ డ్యాన్స్ చేస్తూ వచ్చింది. ఆమె డ్యాన్స్ చూసి ఫిదా అయిపోయిన పెళ్లి అతిధులు ఆమె డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను తమ ఫోన్లలో వీడియో తీయటంలో బిజీబిజీ అయిపోయారు.



చివరకు ఆమె వరుడి వద్దకు చేరుకుని అతని చేతిపై ముద్దు కూడా పెట్టింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. మరి మీరు కూడా చూసేయండి ఆ వధువు సన్నీలియోన్ డ్యాన్స్ ని..