Maharashtra Budget: ‘పంచామృతాల బడ్జెట్’ ప్రవేశ పెట్టిన మహా డిప్యూటీ సీఎం ఫడ్నవీస్

విద్యార్థులకు స్కాలర్‌షిప్: మహారాష్ట్ర ప్రభుత్వం 5 నుంచి 7వ తరగతి విద్యార్థులకు రూ. 1,000 నుండి రూ. 5,000, 8వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు రూ.1,500 నుండి రూ. 7,500 వరకు స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. అంతేకాకుండా, విద్యార్థులకు యూనిఫారాలు ఉచితంగా అందజేయనున్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి వరకు అన్ని వర్గాలకు ఇవి ఇవ్వనున్నారు

Maharashtra Budget: ‘పంచామృతాల బడ్జెట్’ ప్రవేశ పెట్టిన మహా డిప్యూటీ సీఎం ఫడ్నవీస్

Maharashtra Budget 2023-24: 10 BIG Announcements

Maharashtra Budget: రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగం, పర్యావరణం.. ఈ ఐదు అంశాలు లక్ష్యంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆర్థిక మంత్రిత్వ నిర్వహిస్తున్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఈ ఐదు అంశాలను ఆయన ‘పంచామృతాలు’ అని బడ్జెట్ సందర్భంగా పేర్కొన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ యేడాదికి గాను 4,27,780 కోట్ల రూపాయల బడ్జెట్ అంచనా వేశారు. దీనికి ముందు రోజైన బుధవారం తాజా ఆర్థిక సర్వేను విడుదల చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో 6.8 ఆర్థిక వృద్ధి ఉన్నట్లు వెల్లడించారు. అయితే భారత ఆర్థిక వృద్ధితో పోల్చుకుంటే చాలా తక్కువ. భారత ఆర్థిక వృద్ధి 7.0 శాతంగా ఉంది.

బడ్జెట్‭లోని 10 ముఖ్యమైన అంశాలు..
1. మహిళలకు రాయితీ: అన్ని రాష్ట్ర రవాణా బస్సుల్లో మహిళా ప్రయాణికులకు 50% రాయితీ ఇస్తామని ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తెలిపారు.
2. స్టాంప్ డ్యూటీలో మహిళలకు 1% రాయితీ లభిస్తుందని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.
3. మహారాష్ట్ర ప్రభుత్వం అప్లా దవాఖానాను విస్తరించనుంది. “మేము ప్రారంభించిన చొరవకు భారీ స్పందన వచ్చింది. ఇప్పుడు దివంగత బాలాసాహెబ్ థాకరే పేరు మీద రాష్ట్రవ్యాప్తంగా 700 అప్లా దవాఖానా డిస్పెన్సరీలు ప్రారంభిస్తాము. దీని ద్వారా ఉచిత చికిత్స అందుతుంది” అని బడ్జెట్‌ను సమర్పిస్తూ దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు.
4. మహారాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయ మత్స్యకారులకు కేంద్రం సహాయంతో రూ.5 లక్షల బీమా పథకాన్ని ప్రకటించింది.
5. ప్రధానమంత్రి ఆవాస్ పథకం: నాలుగు లక్షల కొత్త గృహాలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. వీటిలో 1.5 లక్షలు వెనుకబడిన వర్గాలకు, 25,000 మతంగ్ సమాజ్‌కు అందించనున్నారు.
6. మహాత్మా జన్ ఆరోగ్య పథకం కేటాయింపులను రూ.1.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. దీనిలో మరో 200 అనారోగ్యాలు/వ్యాధులు కూడా ఉంటాయి. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ల గ్రాంట్‌ను కూడా రూ.2.5 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచుతున్నట్లు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.
7. రైతుల కోసం జల్ యుక్త్ శివర్ పథకం-II ప్రారంభించనున్నారు. అంతకుముందున్న పథకాన్ని మునుపటి ఎంవీఏ ప్రభుత్వం నిలిపివేసింది.
8. విదర్భలోని పెన్గంగ-నల్గాన ప్రాజెక్టుకు అనుమతులు, ప్రత్యేక బడ్జెట్‌ మంజూరు చేయనున్నారు.
9. విద్యార్థులకు స్కాలర్‌షిప్: మహారాష్ట్ర ప్రభుత్వం 5 నుంచి 7వ తరగతి విద్యార్థులకు రూ. 1,000 నుండి రూ. 5,000, 8వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు రూ.1,500 నుండి రూ. 7,500 వరకు స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. అంతేకాకుండా, విద్యార్థులకు యూనిఫారాలు ఉచితంగా అందజేయనున్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి వరకు అన్ని వర్గాలకు ఇవి ఇవ్వనున్నారు.
10. మహారాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏడాదికి రూ.12,000 గౌరవ వేతనం ప్రకటించింది. ప్రధాన మంత్రి కృషి సమ్మాన్ నిధి యోజనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు సంవత్సరానికి 6,000 రూపాయలు, మిగిలిన 6,000 రూపాయలను కేంద్రం ఇస్తుంది.