Bar Owner : బార్ లో మంత్రి ఫోటోకు పూజలు చేస్తున్న యజమాని..ఎందుకంటే..

ఓ బార్‌ అండ్ రెస్టారెండ్ యజమాని తన ఓ మంత్రికి ప్రతీరోజు పూజలు చేస్తున్నాడు. అగర్ బత్తీలు వెలిగించి కర్ఫూరహారతులు ఇస్తూ ప్రతీరోజు ప్రత్యేక పూజలు చేస్తున్నాడు.‘ మా దేవుడి నువ్వే సామీ..’ అంటూ మంత్రి విజయ్‌ వాడెట్టివర్‌ కు పూజలు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Bar Owner : బార్ లో మంత్రి ఫోటోకు పూజలు చేస్తున్న యజమాని..ఎందుకంటే..

Chandrapur Bar And Restaurant Owner

Maharashtra : మహారాష్ట్రలో ఓ బార్‌ అండ్ రెస్టారెండ్ యజమాని తన ఓ మంత్రికి ప్రతీరోజు పూజలు చేస్తున్నాడు. అగర్ బత్తీలు వెలిగించి కర్ఫూరహారతులు ఇస్తూ ప్రతీరోజు ప్రత్యేక పూజలు చేస్తున్నాడు.‘ మా దేవుడి నువ్వే సామీ..’ అంటూ మంత్రి విజయ్‌ వాడెట్టివర్‌ కు పూజలు చేస్తున్నాడు. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ బార్ ఓనర్ కు సదరు మంత్రిగారు ఎటువంటి సహాయం చేయలేదు. అలాగని ఆ మంత్రిగారంటూ అతనికి అభిమానమూ కాదు. మరి ఎందుకు చేస్తున్నాడు పూజలు అనే కదా..డౌటు.

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా మద్యపానంపై ఉన్న నిషేధాన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. గత ఆరు సంవవత్సరాల తరువాత మళ్లీ జిల్లాలోమళ్లీ వైన్ షాపులు, బార్లు కళకళలాడిపోతున్నాయి. దీంతో మంత్రి విజయ్ వాడేటివార్ ప్రభుత్వానికి భారీగా ఆదాయం కూడా వస్తోంది.
చంద్రాపూర్‌తో పాటు వార్ధా, గడ్చిరోలి జిల్లాలో 2015, ఏప్రిల్‌ నుంచి మద్యంపై నిషేధం అమల్లో ఉంది. అప్పటి బీజేపీ హయాంలోని సీఎం ఫడ్నవీస్ సర్కార్‌ లిక్కర్‌‌ను బ్యాన్ చేసి లైసెన్స్‌లను వెనక్కి తీసుకుంది. ఐతే ఆఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని 2018లో రిటైర్డ్‌ అధికారి రామనాథ్‌ నేతృత్వంలో ఓ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

అక్కడ మద్యం అమ్మకాల నిషేధం వల్ల క్రైమ్‌ రేట్‌ తగ్గ లేదని.. పైగా నకిలీ మద్యం అమ్మకాలు పెరిగాయని ఈ ఏడాది మేలో ఆ కమిటీ రిపోర్టు ఇచ్చింది. ఆ కమిటీ ప్రతిపాదనలతో వార్దా, గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాల్లో మద్యం నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.ఐతే కమిటీకి మద్య నిషేధం ఎత్తేయాలని సూచించిన వారిలో చంద్రాపూర్‌ జిల్లా గార్డియన్‌ మంత్రి విజయ్‌ వాడెట్టివర్‌ కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ మంత్రికి చంద్రాపూర్ జిల్లాలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ యజమాని పూజలు చేస్తున్నాడు. మంత్రి విజయ్ వాడెట్టివర్ తమకు దేవుడని.. మా బతుకు తెరువును మళ్లీ తిరిగి ఇప్పించాడని తెలిపాడు. అందుకే మంత్రిగారికి పూజలు చేస్తున్నానని చెప్పాడు. కాగా, మద్య నిషేధం వలన గత ఐదేళల్లో చంద్రాపూర్‌ జిల్లా నుంచి దాదాపు రూ.1,600 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది.