ఓటు వేసిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఫ్యామిలి

  • Edited By: veegamteam , April 11, 2019 / 10:41 AM IST
ఓటు వేసిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఫ్యామిలి

మహారాష్ట్ర : లోక్ సభ ఎన్నికల్లో సీఎం దేవేంద్ర ఫడ్నీవీస్ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. లోక్ సభ తొలి విడత ఎన్నికలలో భాగంగా భార్య అమృత, తల్లితో  కలిసి ఈరోజు ఉదయం  నాగ్ పూర్ లో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..ప్రజాస్వామ్య పండుగలో అందరూ పాలుపంచుకోవాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు.

కాగా మధ్యాహ్నాం 3 గంటలకు 38.35 శాతం ఓటింగ్ నమోదయ్యింది. నాగ్ పూర్ సౌత్ లో 38.63 శాతం, , ఈస్ట్ లో 40.23, నాగర్ పూర్ సెంట్రల్ లో 38.15, వెస్ట్ లో 33.90, నార్త్ లో 37.58 శాతం ఓటింగ్ నమోదు కాగా ఓవరాల్ గా 38.35 శాతం ఓటింగ్ నమోదయ్యింది.