Hingoli : హెలికాప్టర్ కొని, అద్దెకు తిప్పుకుంటా లోను ఇవ్వండి-బ్యాంకును కోరిన రైతు

అకాలవర్షాలు... ప్రతికూల వాతావరణ పరిస్ధితుల్లో వ్యవసాయం చేయలేక పోతున్నానని... తన భూమి తనఖా పెట్టుకుని హెలికాప్టర్ కొనక్కునేందుకు రుణం ఇవ్వాలని మహారాష్ట్రలోని ఒక రైతు బ్యాంకు అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు.

Hingoli : హెలికాప్టర్ కొని, అద్దెకు తిప్పుకుంటా లోను ఇవ్వండి-బ్యాంకును కోరిన రైతు

Hingoli farmer

Hingoli :  అకాలవర్షాలు… ప్రతికూల వాతావరణ పరిస్ధితుల్లో వ్యవసాయం చేయలేక పోతున్నానని… తన భూమి తనఖా పెట్టుకుని హెలికాప్టర్ కొనక్కునేందుకు రుణం ఇవ్వాలని మహారాష్ట్రలోని ఒక రైతు బ్యాంకు అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు.  రైతు డిమాండ్ ఆ ప్రాంతంలో పెద్ద చర్చనీయాంశం అయ్యింది.

మహారాష్ట్రలోని   హింగోలి జిల్లా   తక్టోడాకు చెందిన రైతు కైలాస్ పతంగే‌కు  రెండెకరాల పొలం ఉంది. అతనికి గత కొన్నేళ్ళుగా వ్యవసాయంలో నష్టాలు వస్తున్నాయి. గడిచిన రెండు సంవత్సరాలుగా తన పొలంలో సోయాబీన్ వేశానని ఆదాయం రాలేదని   పేర్కోన్నాడు.  దీంతో బాగా ఆలోచించి హెలికాప్టర్ అద్దెకు ఇచ్చే వ్యాపారం చేద్దామని డిసైడ్ అయ్యాడు.

ప్రస్తుతం ఈరంగంలో పోటీలేదని అభిప్రాయ పడ్డాడు.  హెలికాప్టర్ అద్దెకు ఇస్తే గంటకు వేల రూపాయలలో అద్దె లభిస్తుందని భావించాడు.  హెలికాప్టర్ కొనాలంటే డబ్బుకావాలి. తనకున్నరెండెకరాల పొలం అమ్మి కొందామంటే ఆ డబ్బు సరిపోదు. అందుకని బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

గోరేగావ్ లోని స్టేట్ బ్యాంకు  ఆఫ్ ఇండియాకు  వెళ్లి  హెలికాప్టర్ కొనుక్కోటానికి   తనకు రుణం మంజూరు చేయాలని కోరాడు.  కేవలం ధనవంతులకే పెద్ద పెద్ద కలలు ఉండాలని ఎవరు చెప్పారు.  రైతులు కూడా పెద్ద కలలు కనాలి అంటున్నాడు కైలాస్ పతంగే.  మరి ఎస్‌బీఐ  రుణం మంజూరు చేస్తుందో లేదో వేచి చూడాలి.

Also Read : Tenth Exam Results : పదో తరగతి పరీక్షలు రాసిన తండ్రీకొడుకులు.. తండ్రి పాస్, కొడుకు ఫెయిల్