స్కూల్స్ లో మరాఠీ తప్పనిసరి : ‘మహా’సర్కార్ కీలక నిర్ణయం

  • Published By: veegamteam ,Published On : January 18, 2020 / 06:50 AM IST
స్కూల్స్ లో మరాఠీ తప్పనిసరి : ‘మహా’సర్కార్ కీలక నిర్ణయం

మహారాష్ట్ర ప్రభుత్వం మాతృభాష అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రతీ స్కూల్స్ లోను మరాఠీ భాషను తప్పనిసరి చేయాల్సిందేనంటోంది. దీనికి సంబంధించి చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. సీబీఎస్సీ, ఐసీఎస్సీ వంటి స్కూల్స్ తప్పిస్తే మిగతా అన్ని స్కూల్స్ లోను మరాఠీని విధిగా అమలు చేయాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికారులకు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సంబంధిత అధికారులు స్కూల్స్ లో మరాఠీని తప్పనిసరిచేస్తూ సర్క్యులర్ జారీ చేశారు. 
 
ఇప్పటికే అన్ని స్కూల్స్ కు దీనికి సర్క్యులర్ జారీ అయినా పలు స్కూల్స్ దీనిని అమలు చేయడానికి ఇష్డపటంలేదు. మరాఠీ భాషను విధిగా అమలు చేయాలన్న చట్టం ఇప్పటి వరకైతే లేదు కానీ, కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చే స్కూల్స్ దీనిని ఎందుకు అమలు చేయడం లేదని ఓ అధికారి సూటిగా ప్రశ్నించారు. 

దీనిపై విద్యా శాఖాధికారి విశ్వజిత్ మాట్లాడుతూ..మరాఠీని విధిగా అమలు చేయాల్సిందేనన్న చట్టాన్ని తీసుకురాబోతున్నాం. మహారాష్ట్రలో నివసిస్తున్నారు కాబట్టి కచ్చితంగా మరాఠీలో మాట్లాడటం, రాయడం చేయాలి. ఈ నిర్ణయాన్ని అన్ని స్కూల్స్ తప్పనిసరిగా అమలు చేయాలి. ఒకవేళ అమలు చేయకుంటే ఆయా స్కూల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ తరహాలో, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రాథమిక పాఠశాలల్లో మరాఠీని తప్పనిసరి చేయడానికి చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని ఆమోదించాలని నిర్ణయించింది అని ఓ అధికారి తెలిపారు.