Petrol VAT: పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించిన మహారాష్ట్ర ప్రభుత్వం: ఎంతంటే!

రాష్ట్రంలో లీటరు పెట్రోల్‌పై రూ.2.08, డీజిల్‌పై రూ.1.44 వ్యాట్ తగ్గిస్తూ ఉద్ధవ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన చేసింది.

Petrol VAT: పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించిన మహారాష్ట్ర ప్రభుత్వం: ఎంతంటే!

Uddhav

Petrol VAT: దేశంలో సామాన్యులపై భారం తగ్గించేలా పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. లీటర్ పెట్రోల్ పై రూ. 8, డీజిల్ పై రూ. 6 ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తాజా తగ్గింపుతో లీటర్ పెట్రోల్ పై సుమారు రూ. 9.50, డీజిల్ పై రూ. 7 ధర తగ్గింది. కాగా, తమ వంతుగా ప్రజల పై భారం పడకుండా, ప్రభుత్వానికి నష్టం వస్తున్నా సరే..ఈ సుంకాన్ని తగ్గించమని, ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతుగా వ్యాట్ తగ్గించాలని కేంద్రం సూచించింది. అయితే కేంద్ర ప్రభుత్వ సూచనను పట్టించుకోని కొన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గించేందుకు నిరాకరించాయి. ఇదిలాఉంటే..మహారాష్ట్రలో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Other Stories:Qutub Minar: కుతుబ్ మినార్ వద్ద తవ్వకాలు.. కిషన్ రెడ్డి ఏం చెప్పారంటే

రాష్ట్రంలో లీటరు పెట్రోల్‌పై రూ.2.08, డీజిల్‌పై రూ.1.44 వ్యాట్ తగ్గిస్తూ ఉద్ధవ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన చేసింది. దీంతో నెల నెల పెట్రోల్ పై రూ. 80 కోట్లు, డీజిల్ పై రూ. 125 కోట్లు రాష్ట్ర ఖజానాకు నష్టం కలుగుతుంది. మొత్తంగా ఏడాదికి రూ. 2500 కోట్లు భారం రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. కాగా, పెట్రోల్ డీజిల్ పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంపై సీఎం ఉద్ధవ్ థాకరే పెదవి విరిచారు. ఈ తగ్గింపు సరిపోదని, ప్రజలపై భారం తగ్గించి నిత్యావసరాల ధరలు తగ్గాలంటే పెట్రోల్, డీజిల్ పై మరింత సుంకాన్ని తగ్గించాలని సీఎం ఉద్ధవ్ థాకరే సూచించారు.

Other Stories:Pawan Kalyan On PetrolPrices : దేశంలో ఏపీలోనే పెట్రో ధరలపై పన్నులు ఎక్కువ, తగ్గించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్