Maharashtra : కరోనా విలయం, మహారాష్ట్రలో ఐసోలేషన్ వార్డులుగా మారుతున్న రైళ్లు

రాష్ట్ర ప్రభుత్వం పలు రైళ్లను ఐసోలేషన్ వార్డులగా మార్చి వేస్తోంది. ప్రభుత్వ కోరిక మేరకు..రైల్వే శాఖ 21 కోచ్ లను ఐసోలేషన్ వార్డులుగా మార్చి వేసింది.

Maharashtra : కరోనా విలయం, మహారాష్ట్రలో ఐసోలేషన్ వార్డులుగా మారుతున్న రైళ్లు

Maharashtra Govt

Coaches Into Isolation Wards : మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తుండడం కలవరం రేపుతోంది. భారతదేశంలో కరోనా విస్తరిస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతోంది. లాక్ డౌన్ విధిస్తేనే వైరస్ విస్తరించకుండా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. అధిక సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. దీంతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పలు రైళ్లను ఐసోలేషన్ వార్డులగా మార్చి వేస్తోంది. ప్రభుత్వ కోరిక మేరకు..రైల్వే శాఖ 21 కోచ్ లను ఐసోలేషన్ వార్డులుగా మార్చివేసింది. Nandurbar ప్రాంతానికి వీటిని పంపించింది. ఒక్కో కోచ్ లో 16 బెడ్స్ ఉంటాయని, కూలర్ కూడా అందుబాటులో ఉంటుందని రైల్వే వెల్లడించింది.

కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. మాస్క్ ధరించని వారికి రూ. 1000 జరిమాన విధించాలని అధికారులను ఆదేశించింది. బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాలు రవాణా వాహనాల్లో మాస్క్ కంపల్సరీ చేస్తూ ఆదేశాలిచ్చింది. వీటిని తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్లు, పోలీసులు, ఉన్నతాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు..నెలలో జరుగబోయే 10, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. 10వ తరగతి వార్షిక పరీక్షలు జూన్ లో, 12వ తరగతి పరీక్షలు మే నెలలో నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి వర్ష గైక్వాడ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఇదిలా ఉంటే..వైరస్ ఉధృతిపై ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వరుస సమావేశాలు నిర్వహించారు. లాక్ డౌన్ విధించాలని ఠాక్రే సర్కార్ భావిస్తోందని తెలుస్తోంది. దీనిపై 2021, ఏప్రిల్ 14వ తేదీ బుధవారం ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Read More : Coimbatore : హోటల్లో పోలీసు వీరంగం, లాఠీతో చితకబాదాడు..వీడియో వైరల్