Maharashtra Stop Bus Services : ముదిరిన సరిహద్దు వివాదం.. కర్ణాటకకు బస్సు సర్వీసులను నిలిపివేసిన మహారాష్ట్ర

కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. దీంతో కర్ణాటకకు బస్సు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు మహారాష్ట్ర రోడ్డు ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది.

Maharashtra Stop Bus Services : ముదిరిన సరిహద్దు వివాదం.. కర్ణాటకకు బస్సు సర్వీసులను నిలిపివేసిన మహారాష్ట్ర

Maharashtra Stop Bus Services : కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. సరిహద్దు వివాదంపై కర్ణాటకలో కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. మంగళవారం మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులపై కర్ణాటకలో నిరసనకారులు దాడులకు పాల్పడ్డారు. బస్సులపైకి రాళ్లు విసిరి అద్దాలు పగలగొట్టారు.

Maharashtra Vs Karnataka : మరింత ముదిరిన మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదం.. దీని వెనుక గల కారణాలు

దీంతో కర్ణాటకకు బస్సు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు మహారాష్ట్ర రోడ్డు ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. కర్ణాటకలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి బస్సులను నడపడం మంచిది కాదని మహారాష్ట్ర పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు తాము బస్సు సర్వీసులను నిలిపివేశామని పేర్కొంది. మళ్లీ పోలీసుల క్లియరెన్స్ వచ్చిన తర్వాతే బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభిస్తామని తెలిపింది.