మందుబాబులకు గుడ్ న్యూస్, మద్యం షాపులు తెరుస్తారట, కానీ ఓ కండీషన్

లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు మూతపడిన సంగతి తెలిసిందే. చాలా రాష్ట్రాల్లో వైన్స్ షాపులు క్లోజ్ లో ఉన్నాయి. మందు దొరక్కపోవడంతో మద్యం ప్రియులు

  • Published By: veegamteam ,Published On : April 21, 2020 / 10:12 AM IST
మందుబాబులకు గుడ్ న్యూస్, మద్యం షాపులు తెరుస్తారట, కానీ ఓ కండీషన్

లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు మూతపడిన సంగతి తెలిసిందే. చాలా రాష్ట్రాల్లో వైన్స్ షాపులు క్లోజ్ లో ఉన్నాయి. మందు దొరక్కపోవడంతో మద్యం ప్రియులు

లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు మూతపడిన సంగతి తెలిసిందే. చాలా రాష్ట్రాల్లో వైన్స్ షాపులు క్లోజ్ లో ఉన్నాయి. మందు దొరక్కపోవడంతో మద్యం ప్రియులు విలవిలలాడిపోతున్నారు. మద్యం కోసం అవస్థలు పడుతున్నారు. కొందరు పిచ్చోళ్లయ్యారు. మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. లాక్ డౌన్ ఎప్పుడెప్పుడు ఎత్తివేస్తారా? మద్యం షాపులు ఎప్పుడు తెరుస్తారా? అని మందుబాబులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వైన్ షాపుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

మద్యం షాపులు తెరవడానికి అనుమతి కోరిన ఆల్కహాలిక్‌ బేవరెజ్‌ సమాఖ్య:
మద్యం షాపులు తెరవడంపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మద్యం షాపులు తెరిచేందుకు పర్మిషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని ప్రకటించింది. అయితే ఓ కండీషన్ పెట్టింది. భౌతికదూరం నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తేనే, రాష్ట్రంలో మద్యం షాపులను తెరవడానికి అనుమతిస్తామని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోప్‌ తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడానికి, ఉపాధి కల్పించడానికి రాష్ట్రంలో డిస్టిలరీ నుంచి వైన్‌ షాపుల వరకు విడతలవారీగా వ్యాపారం ప్రారంభించడానికి అనుమతించాలని కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆల్కహాలిక్‌ బేవరెజ్‌ కంపెనీస్‌ (సీఐఏబీసీ) సీఎం ఉద్ధవ్‌ థాక్రేను గతవారం కోరింది. దీనిపై చర్చించిన ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. 

భౌతికదూరం నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తేనే:
వైన్స్ షాపులు భౌతిక దూరం నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తేనే మద్యం షాపులను తెరవడానికి అనుమతించాలని ప్రభుత్వం కండీషన్ పెట్టింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించిన ప్రభుత్వం పరిమిత సంఖ్యలో వ్యాపారాలను నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది.

మద్యం తాగితే రోగనిరోధక శక్తిపై ప్రభావం:
ప్రభుత్వం చేసిన ప్రకటన మందుబాబుల్లో కొత్త ఆశలు నింపింది. మద్యం షాపులు తెరుస్తారని ఆశిస్తున్నారు. కాగా మన దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర టాప్ లో ఉంది. మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకి కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 4వేల 600 కేసులు, 230 మరణాలు నమోదయ్యాయి. ప్రతి రోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మద్యం షాపులు తెరవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని ఆందోళన చెందుతున్నారు.

ప్రజల ప్రాణాల కన్నా విలువైనది ఏదీ లేదంటూ కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మద్యం షాపులు తెరవడానికి అనుమతి ఇవ్వని సంగతి తెలిసిందే. మద్యం తాగడం వల్ల రోగ నిరోధక శక్తిపై ప్రభావం పడుతుందని, కరోనా మరింతగా విజృంభించే ప్రమాదం ఉందని కొన్ని ప్రభుత్వాలు చెబుతున్నాయి. దీంతో ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదని చెప్పాయి. మద్యం అమ్మకాలు ఆగిపోవడంతో ప్రభుత్వాలకు భారీగా ఆదాయం పడిపోయింది. అయినా ప్రజల సంక్షేమం కోసం కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వైన్స్ షాపుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి.