కరోనావైరస్ లాక్‌డౌన్ ఎఫెక్ట్.. బైక్‌లు చోరీ చేసిన ఇద్దరు వ్యాపారస్థులు

కరోనావైరస్ లాక్‌డౌన్ ఎఫెక్ట్.. బైక్‌లు చోరీ చేసిన ఇద్దరు వ్యాపారస్థులు

కొద్ది నెలల ముందు వరకూ వ్యాపారం సజావుగానే సాగింది. బిజినెస్ ఇంకా పెంచాలనే కుతూహలంతో పనిచేశారు. కానీ, కొవిడ్-19 వచ్చింది. సంక్షోభంతో కుదేలు చేసింది. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి తట్టుకోవడానికి వారు తప్పుదోవ ఎంచుకున్నారు. ఆ ఇద్దరు వ్యాపారస్థులు బైక్ దొంగతనాలు మొదలుపెట్టారు.

శనివారం నాగ్‌పూర్ పోలీసులు మోనిష్ దడ్లానీ(27), వివేక్ సేవక్ గుమ్నానీ(22)ను అరెస్టు చేశారు. వారి దగ్గర్నుంచి 10దొంగిలించిన టూ వీలర్స్ దాదాపు రూ.3లక్షల విలువైనవి స్వాధీనపరచుకున్నారు. సదర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మహేశ్ బన్సోడే కేసు దర్యాప్తు చేస్తున్నారు.

లాక్‌డౌన్ సమయంలో వారి వ్యాపారం కుదేలు కావడంతో తీసుకున్న లోన్ కట్టడానికి దొంగతనాలు మొదలుపెట్టారు. దడ్లానీ క్లాత్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నడుపుతుండగా.. గుమ్నానీ అనే వ్యక్తి టూర్ పనులు చూస్తుంటారు.