New Variant : రెండు డోసులు వేసుకుంటేనే..రాష్ట్రంలోకి రానిస్తాం..మళ్లీ ఆ రోజులు వస్తాయా ?

కరోనా టీకా రెండు డోసులు వేసుకున్న వారికు ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేస్తోంది. RTPCR రిపోర్టుతోనే రావాలని నిబంధన పెట్టింది.

New Variant : రెండు డోసులు వేసుకుంటేనే..రాష్ట్రంలోకి రానిస్తాం..మళ్లీ ఆ రోజులు వస్తాయా ?

Maharastra

Maharashtra Issues : రెండు డోసులు వేసుకుంటేనే..రాష్ట్రంలోకి ఎంట్రీ ఉంటుంది. లేకపోతే..లేదు. కఠిన నియమ నిబంధనలు పాటించాల్సిందే. లేకపోతే..చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మళ్లీ ఆ రోజులు వస్తాయా ? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే…కరోనా తగ్గిపోతున్న క్రమంలో..కొత్తరకం వేరియంట్ ప్రజల కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది. కొత్త వేరియంట్ కు ‘ఒమిక్రాన్’ అని పేరు పెట్టారు. విదేశాల్లో ఎక్కువ సంఖ్యలో కొత్త వేరియంట్ కు సంబంధించిన కేసులు వెలుగు చూస్తుండడంతో భారత్ అప్రమత్తమైంది.

Read More : Tractor March : రైతుల పార్లమెంట్ ట్రాక్టర్ ర్యాలీ వాయిదా

జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వేరియంట్ ఉధృతిపై ఆరా తీశారు. ఈ క్రమంలో..పలు రాష్ట్రాలు కూడా అలర్ట్ అయ్యాయి. పలు ఆంక్షలను విధిస్తున్నాయి. ప్రధానంగా విదేశాల నుంచి వచ్చే వారిపై ఫోకస్ పెడుతున్నారు. విమానాశ్రయాల్లో వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో..మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి వచ్చే వారిపై ఆంక్షలు విధించింది. కరోనా టీకా రెండు డోసులు వేసుకున్న వారికు ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేస్తోంది. RTPCR రిపోర్టుతోనే రావాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిబంధన పెట్టింది.

Read More : Covid-19 Update : భారత్‌లో కొత్తగా 8,318 కేసులు, 465 మరణాలు

గతంలో కరోనా వైరస్ ఉధృతిలో కేరళ తర్వాత మహారాష్ట్రలోనే అధికంగా కేసులు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. మరణాలు కూడా అదేస్థాయిలో ఉండడంతో అప్పట్లోనే ప్రభుత్వం కఠినమైన నిబంధనలు అమలు చేసింద. కొన్ని రోజుల పాటు లాక్ డౌన్ విధించింది కూడా. కంటైన్ మెంట్ జోన్లుగా ఏర్పాటు చేయడం..పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది రాష్ట్ర ప్రభుత్వం. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా జోరుగా కొనసాగిస్తోంది. అయితే..ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు రావడంతో నియమ, నిబంధనలు సడలించింది. కానీ..అకస్మాత్తుగా కొత్త వేరియంట్ వెలుగులోకి రావడంతో..అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది.