మహారాష్ట్ర సీఎం భార్య రష్మీ ఠాక్రేకు కరోనా..పర్బని జిల్లాలో నెలాఖరు వరకు లాక్ డౌన్

దేశవ్యాప్తంగా మళ్లీ కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదవుతన్నాయి.

మహారాష్ట్ర సీఎం భార్య రష్మీ ఠాక్రేకు కరోనా..పర్బని జిల్లాలో నెలాఖరు వరకు లాక్ డౌన్

Rashmi

Rashmi దేశవ్యాప్తంగా మళ్లీ కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదవుతన్నాయి. మహారాష్ట్రలో కరోనా వైరస్‌ కేసులు తిరిగి పెరుగుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్బని జిల్లాలో ఈనెల 24 నుంచి 31 వరకూ లాక్‌డౌన్‌ విధించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ దీపక్‌ ముగలికర్‌ స్పష్టం చేశారు. రాత్రి వేళల్లో ప్రజలను బయటకు అనుమతించకపోవడం వంటి చర్యలు చేపట్టినా కొవిడ్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించామని చెప్పారు. ఈనెల 24న రాత్రి ఏడు గంటల నుంచి వర్తించే లాక్‌డౌన్‌ 31 వరకూ కఠినంగా అమలవుతుందని అన్నారు.

కొవిడ్‌-19 కేసులను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు. ఇక,వైరస్ కేసులు ఇలాగే పెరిగితే,ప్రజలు కోవిడ్-19 నిబంధనలు పాటించకుంటే పలు నగరాల్లో లాక్‌డౌన్‌ విధించే ఆలోచనలో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఉన్నారని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్‌ తోపే ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు సంపూర్ణ లాక్‌డౌన్‌తో ఫలితం ఉండదని వైరస్‌ వ్యాప్తిని ఇది అడ్డుకోలేదని మహారాష్ట్ర కొవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌లో కొందరు సభ్యులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు.

మరోవైపు, సీఎం ఉద్దవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే కూడా కరోనాబారినపడ్డారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో సీఎం అధికారిక నివాసంలో ఆమె సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నారు. ఇక,మహారాష్ట్రలో మంగళవారం 28,699కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 132 కోవిడ్ మరణాలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు