Monkeys Revenge on Dogs :కుక్కలపై పగ తీర్చుకున్న కోతులు..250 కుక్క‌పిల్లలను ఎలా చంపాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

కుక్కలపై కోతులు అత్యంత దారుణంగా పగ తీర్చుకున్నాయి. ఏకంగా 250 కుక్కలను వాటి పిల్లలను కోతుల గుంపు చంపేసాయి.

Monkeys Revenge on Dogs :కుక్కలపై పగ తీర్చుకున్న కోతులు..250 కుక్క‌పిల్లలను ఎలా చంపాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Monkeys Kill Dogs

Monkeys revenge 250 Kill Dogs : కుక్కలపై కోతులు అత్యంత దారుణంగా పగ తీర్చుకున్నాయి. ఏకంగా 250 కుక్కల్ని కోతుల గుంపు చంపేసిన తీరు పక్కా ప్లాన్ వేసినట్లుగానే ఉంది. కుక్కల్ని కోతులు ఎంత పాశవికంగా చంపేశాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. కోతులకు..కుక్కలకు తగని వైరం ఉంటుందనే విషయం తెలిసిందే. కోతి కనిపిస్తే చాలు కుక్కలు వెంటపడి మరీ తరుముతాయి. కానీ కుక్కలపై కోతుల గుంపు అంత దారుణంగా పగ తీర్చుకోవటానికి గల కారణమేంటో తెలిస్తే నివ్వెరపోవాల్సిందే. దెబ్బకు దెబ్బా..ప్రాణానికి ప్రాణం అంటారు కదా..అలా పగ తీర్చుకున్నాయి కోతులు కుక్కలమీద. కానీ ఇక్కడ ప్రాణానికి ప్రాణం కాదు ప్రాణానికి ప్రాణాలే తీసేశాయి. అలా 250 కుక్కపిల్లల్ని కోతులు గుంపు చంపేసింది. వాటి దారుణ పగ వెనుక కోతుల కడుపుకోత కారణమైంది..

Read more : Rahul gandhi in UP : మోడీ నియంతృత్వ నిర్ణయాలతో ప్రజలు చస్తూ జీవిస్తున్నారు : రాహుల్ గాంధీ

మ‌హారాష్ట్ర‌లోని బీడ్ జిల్లా మాజ‌ల్‌గావ్‌లో గ‌త నెల‌లో ఓకోతి పిల్ల‌ను కొన్ని కుక్క‌లు క‌లిసి వెంటాడి.. వేటాడి చంపేశాయి. అది కళ్లారా చూసిన కోతులు ఆ కుక్కలపై రగిలిపోయాయి. కోతిపిల్లను కుక్కలు చీల్చి చెండాటం కళ్లారా చూసిన కోతులు చ‌లించిపోయాయి. దెబ్బకు మరింత దెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నాయి. దీంతో వాటిపై ఎలాగైనా ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని అనుకున్నాయి. పక్కాగా ప్లాన్ వేశాయి.

అలా వారి ప్రతీకారేచ్ఛగా 250 కుక్కలు బలైపోయాయి. ఏకుక్క పిల్ల క‌నిపించినా.. వాటిని ఎత్తుకెళ్లిపోతున్నాయి కోతులు. కుక్కపిల్లలను ఎత్తుకు ఎత్తుగా ఉండే భవనాలు ఎక్కి..అక్కడ నుంచి పడేస్తున్నాయి. దాంతో ఆకుక్కపిల్లలు చచ్చిపోతున్నాయి. అలాగే కుక్కపిల్లల్ని పట్టుకొచ్చి పొడవాటి చెట్లపైకి ఎక్కి అక్క‌డి నుంచి వాటిని వ‌దిలేయ‌డం ప్రారంభించాయి. అలా.. 250 కుక్క‌ల‌ను ఆ కోతులు చంపేశాయి. మాజ‌ల్‌గావ్ చుట్టుప‌క్క‌న కుక్క‌లు భారీ సంఖ్య‌లో చ‌నిపోతుండ‌టంతో ఈ విష‌యం మిస్టరీగా మారింది. కోతులే కుక్క‌ల‌ను చంపుతాయ‌ని తెలుసుకున్న గ్రామ‌స్తులు షాక్ అయ్యారు. ఏం చేయాలో తెలియలేదు.దీంతో ట‌వీ శాఖ అధికారుల‌కు విషయం తెలిపారు. వెంట‌నే రంగంలోకి దిగిన అట‌వీ శాఖ అధికారులు కోతుల‌ను మాత్రం ప‌ట్టుకోలేక‌పోయారు.

Read more : 1,306 Legged Millipede : కళ్లు లేని..1,306 కాళ్లున్న అరుదైన జీవిని గుర్తించిన పరిశోధకులు

గ్రామంలో ఉన్న కుక్క‌ల‌న్నింటినీ కోతులు చంపేయ‌డంతో అక్క‌డ ఒక్క కుక్క కూడా క‌నిపించ‌డం లేద‌ట‌. కుక్క‌ల‌ను చంప‌డం పూర్త‌య్యాక‌.. త‌మ ప్ర‌తీకారం తీరాక‌.. కోతులు ఊళ్లో ఉన్న చిన్న‌పిల్ల‌ల మీద త‌మ ప్ర‌తాపాన్ని చూపిస్తున్నాయ‌ట‌. దీంతో గ్రామ‌స్థులు కోతులు ఎక్క‌డ క‌నిపిస్తే అక్క‌డ త‌ర‌మడం మొద‌లు పెట్టారు. దీంతో కోతుల హల్ చల్ త‌గ్గింద‌ంటున్నారు గ్రామ‌స్తులు.

లావూర్ లో 5,000మంది జనాభా ఉన్నారు.కానీ గ్రామంలో ఒక్కటంటే ఒక్క కుక్కగానీ..కుక్కపిల్లగానీ కనిపించట్లేదు. కుక్కల్ని మొత్తం తుడిచిపెట్టేశాయి కోతులు..తమ బిడ్డను చంపింనందుకు తీవ్రస్థాయిలో ఏకంగా గ్రామంలో ఒక్క కుక్క కూడా లేకుండా చంపేశాయి…