Old Age Home..వృద్ధాశ్రమంలో 67మందికి కరోనా

దేశంలో మళ్లీ కొన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ అలజడి రేపుతోంది. గత వారం కర్ణాటకలోని ధర్వాడ్ లో ఓ మెడికల్ కాలేజీలోని దాదాపు 250 మందికిపైగా విద్యార్థులకు కరోనా సోకగా..తాజాగా మహారాష్ట

Old Age Home..వృద్ధాశ్రమంలో 67మందికి కరోనా

Maha

Old Age Home దేశంలో మళ్లీ కొన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ అలజడి రేపుతోంది. గత వారం కర్ణాటకలోని ధర్వాడ్ లో ఓ మెడికల్ కాలేజీలోని దాదాపు 250 మందికిపైగా విద్యార్థులకు కరోనా సోకగా..తాజాగా మహారాష్ట్రలోని ఓ వృద్ధాశ్రమంలోని 67మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.

థానే జిల్లా భివాండి మండలం సోర్గావ్ గ్రామంలోని ‘మాతోశ్రీ’ వృద్ధాశ్రమంలో 67 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సోమవారం స్థానిక అధికారులు తెలిపారు. ఇటీవల ఆశ్రమంలోని కొందరు మహిళలు అస్వస్థతతకు గురవగా..ఆశ్రమ నిర్వాహకులు సమాచారంతో అధికారులు 109 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారని..ఇందులో 67 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. కాగా.. 15 నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు తెలిపారు. వాటి నివేదికలు రెండు రోజుల్లో వస్తాయని తెలిపారు.

అయితే కోవిడ్ నిర్ధారణ అయిన వారిలో 62 మంది వృద్ధులు(37 మంది పురుషులు, 25 మంది మహిళలు) ఉండగా.. ఐదుగురు వృద్ధాశ్రమంలో పనిచేసే సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాధితులందరినీ హాస్పిటల్ లో చేర్చి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు థానే వైద్యాధికారి డాక్టర్ మనీశ్ రెంగే తెలిపారు. కరోనా సోకిన వారంతా రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపారు.

సోర్గావ్ గ్రామాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. స్థానికులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ALSO READ Chinese Warplanes : తైవాన్ ను బలవంతంగా ఆక్రమించుకునేందుకు చైనా సిద్ధమైందా!