Omicron : వామ్మో ఒమిక్రాన్.. ఆ రాష్ట్రంలో 7 కేసులు

మొత్తంగా భారతదేశంలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 12కి చేరాయి. మహారాష్ట్రలో 8, కర్నాటకలో 2, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి.

Omicron : వామ్మో ఒమిక్రాన్.. ఆ రాష్ట్రంలో 7 కేసులు

Maharastra Omicron

Maharashtra Omicron : ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్‌ టెన్షన్‌ ఇండియాకు పట్టుకుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేసులు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలో 7 ఒమిక్రాన్ కేసులు గుర్తించారు. కేసులు సంఖ్య 8కి చేరింది. మొత్తంగా భారతదేశంలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 12కి చేరాయి. మహారాష్ట్రలో 8, కర్నాటకలో 2, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వారిని పరీక్షలు చేయగా…పాజిటివ్ నమోదవుతుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. ఒమిక్రాన్‌ వేరియంట్ సోకినట్లు అనుమానిస్తున్నారు. వీరి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు.

Read More : Tourism in Kashmir : కశ్మీర్ కు పొటెత్తుతున్న పర్యాటకులు..తెలుగువాళ్లే ఎక్కువగా

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ కొత్త వేరియంట్ జెట్ స్పీడ్ తో విస్తరిస్తోంది. పలు దేశాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూస్తుండడంతో మరోసారి ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోతున్నాయి. కఠిన నిబంధనలు, ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఒమిక్రాన్ భారత్ లో అంతకంతకూ వ్యాపించే సూచనలు కనిపిస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలోనే ఐదుగురికి ఒమిక్రాన్ వేరియంట్ సోకడంతో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇది మూడో వేవ్ ముప్పును తెచ్చి పెట్టనుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. డెల్టా వేరియంట్ సృష్టించిన నష్టాన్ని ఒమిక్రాన్ సృష్టించకుండా ఉండేలా పక్కా ప్రణాళికలు రూపొందించింది.

Read More : Tata Motors : కారు కొనాలనుకుంటున్న వారికి షాక్.. పెరగనున్న ధరలు

విదేశీ ప్రయాణికులపై నిఘా పెంచింది. దేశంలో కరోనాను కట్టడి చేయాలని, కేసుల సంఖ్య తగ్గించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇలా పకడ్బందీగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో…ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో కొవిడ్ థర్డ్ వేవ్ వచ్చే ఏడాది జనవరి – ఫిబ్రవరి నెలల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.