24 గంటల్లో 55 మంది ‘మహా’పోలీసులకు కరోనా పాజిటివ్

  • Published By: nagamani ,Published On : June 22, 2020 / 10:09 AM IST
24 గంటల్లో 55 మంది ‘మహా’పోలీసులకు కరోనా పాజిటివ్

మహారాష్ట్రలో కరోనా కేసులో కరాళ నృత్యం చేస్తోంది. రోజుకో రికార్డుతో మహారాష్ట్ర కరోనా కేసులతో దూసుకుపోతోంది. ఈ మహమమ్మారి కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా ఏమాత్రం అదుపులేకుండా పెరుగుతూనే ఉంది. 

కరోనా పెరుగుతున్న క్రమంలో ముందుండి పోరాడుతునన డాక్టర్లతో పాటు పోలీసులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రజల కోసం నిత్యం డ్యూటీల్లో ఉండి ప్రజాసేవ మునిగిపోయిన పోలీసులు కరోనా బారిని పడుతున్నారు. 

ఈ క్రమంలో 24 గంటల్లో 55 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో కరోనాతో బాధపడుతున్న పోలీసుల సంఖ్య 4,103కు చేరింది. మహారాష్ట్ర వ్యాప్తంగా  ఇప్పటివరకు కరోనాతో 48 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.  

కాగా..ఇప్పటివరకూ మొత్తం 3,039 మంది పోలీసులు కోలుకోగా, 1,106 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు మహారాష్ట్ర పోలీసు అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, మొదటిసారిగా మహారాష్ట్రలోని ముంబై సెవెన్‌హిల్స్‌ హాస్పిటల్‌లో జూన్‌ 21న కరోనాతో బాధపడుతూ స్టేట్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌కు చెందిన పోలీస్‌ చనిపోయాడు. 

Read: చేతులతో నడుస్తూ కేదార్ నాథ్ కు ప్రదక్షిణలు చేసిన పూజారి