Maharashtra Politics : ముచ్చటగా మూడోసారి సీఎంగా ఫడ్నవీస్​..డిప్యూటీ సీఎంగా ఏక్ నాథ్ షిండే

ఉద్ధవ్ ఠాక్రే రాజీనామానాతో అఘాడీ ప్రభుత్వం కూలిపోవటంతో.. ముచ్చటగా మూడోసారి సీఎంగా ఫడ్నవీస్ అధికార పీఠం ఎక్కనున్నారు. ఉద్ధవ్ ప్రభుత్వం కూలిపోవటంలో కీలక నేతగా ఉన్న ఏక్ నాథ్ షిండే డిప్యూటీ సీఎంకానున్నారు.

Maharashtra Politics : ముచ్చటగా మూడోసారి సీఎంగా ఫడ్నవీస్​..డిప్యూటీ సీఎంగా ఏక్ నాథ్ షిండే

Maharashtra Politics

Maharashtra Politics  : మహారాష్ట్రలో రాజకీయాలు బుధవారం సాయంత్రంతో క్లైమాక్స్ కు చేరుకున్నాయి. బలపరీక్షకు ముందే సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయటంతో ఇక బీజేపీ అధికారం చేపట్టటానికి అన్ని సిద్ధం చేసుకుంది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు హైడ్రామా నడిచింది. బలపరీక్ష నిరూపించుకోవాలంటూ ఉదయం గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ.. ఉద్ధవ్​ సర్కార్​ను ఆదేశించడం, ఈ ఉత్తర్వులపై ప్రభుత్వం సుప్రీంకు వెళ్లడం, స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించడంతో ఉద్ధవ్​ థాక్రే గద్దె దిగారు. రాజీనామాకు కొద్దిసేపు ముందు ఉద్ధవ్​ కేబినెట్​ సమావేశం నిర్వహించి.. ఔరంగాబాద్​ను శంభాజీ నగర్​గా, ఉస్మానాబాద్​ను ధారాశివ్​గా మార్చారు. ప్రభుత్వం పతనం అంచున ఉన్నప్పుడే వీటికి పేర్లు మార్చటం గమనించాల్సిన విషయం.

Also read : Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా

బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఏర్పాట్లు చేసుకుంటోంది. మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ ముచ్చటగా మూడోసారి సీఎంగా అధికారాన్ని చేపట్టనున్నారు. డిప్యూటీ సీఎంగా ఉద్ధవ్ ప్రభుత్వం కూలిపోవటానికి ప్రధాన కారణమైన ఏక్ నాథ్ షిండే నియమితులు కానున్నారు. అలాగే ఉద్థవ్ ను వ్యతిరేకించి షిండేతో కలిసి నడిచిన 12మంది రెబెల్ ఎమ్మెల్యేలకు క్యాబినెట్ లో చోటు దక్కనుంది. మంత్రి వర్గ కూర్పుపై బీజేపీ, షిండే మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఎవరికి క్యాబినెట్ లోకి తీసుకోవాలి అనేదానిపై తీవ్ర చర్చలు జరుపుతున్నారు.

ఈ క్రమంలో షిండే తన వర్గంతో కలిసి ముంబై రానున్నారు.బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్న క్రమంలో సీఎంగా ఫడ్నవీస్ రేపు (జూన్ 30,2022) ప్రమాణస్వీకారం చేయనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఫడ్నవీస్ ముచ్చటగా మూడవసారి సీఎం పీఠాన్ని అధిష్టించనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి ఫడ్నవీస్ నేడు గవర్నర్ ను కలవనున్నారు.కాగా..తన ప్రభుత్వాన్ని నిలుపుకోవటానికి ఉద్ధవ్ ఠాక్రే చివరి క్షణం వరకు పోరాడారు. కానీ ఏమాత్రం ఆయన యత్నాలు ఫలించలేదు.దీనికి ఆయన స్వయంకృతాపరాథం కూడా కారణమనే వార్తలు వచ్చాయి. ఏది ఏమైన ప్రభుత్వాలను కూలగొట్టి తన ఆధిపత్యాన్ని చెలాయింటానికి బీజేపీ యత్నాలు మరోసారి మహారాష్ట్రలో కూడా ఫలించాయి. ఫలితంగా అఘాడీ సర్కార్ ను కూలగొట్టి తన జెండాను ఎగురవేయనుంది కమలదళం.

Also read : Maharashtra CM: ‘మహా’ సీఎంగా ఫడ్నవీస్.. రేపే ప్రమాణ స్వీకారం?

బుధవారం (జూన్ 29,2022) ఫ్లోర్​ టెస్ట్​పై గవర్నర్​ ఆదేశాలను సవాల్​ చేస్తూ శివసేన చీఫ్​ విప్​ సునీల్​ ప్రభు దాఖలు చేసిన పిటిషన్​ పై సుప్రీం విచారణ జరిపింది. అయితే, 16 మంది శివసేన రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హతకు సంబంధించిన కేసులో సుప్రీం తీర్పును బట్టి ఫ్లోర్ టెస్ట్ రిజల్ట్ ను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. అసెంబ్లీ స్పీకర్, గవర్నర్ అధికారాలకు సంబంధించిన అంశంపై జులై 11న విచారిస్తామని పేర్కొంది. దీంతో సుప్రీంలో తీర్పు వ్యతిరేకంగా రావడంతో ఆ తర్వాత కొద్ది నిమిషాలకే ఉద్ధవ్ థాక్రే ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చి రాజీనామా ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఉద్ధవ్ ప్రకటించారు. తన తండ్రి బాల్ థాక్రే ఆకాంక్ష మేరకు ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్ గా మార్చడం తృప్తిని ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ..‘‘నేను భయపడే వ్యక్తిని కాను. వీధుల్లో శివసైనికుల రక్తం చిందడం ఇష్టంలేకనే రాజీనామా చేస్తున్నా. మేం ప్రోత్సహించి, పెద్ద స్థానంలోకి తీసుకొచ్చిన వాళ్లే మమ్మల్ని మోసం చేశారు. నేను అనుకోకుండా సీఎం పదవిని చేపట్టాను. అలాగే పదవి నుంచి దిగిపోతున్నా” అని ఉద్ధవ్ చెప్పారు. తనకు నెంబర్ గేమ్ లు ఆడటంలో ఇంట్రెస్ట్ లేదన్నారు. రెబెల్ ఎమ్మెల్యేలను తిరిగి రానివ్వాలని శివసేన కార్యకర్తలను కోరారు.