Maharashtra: ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. దుప్పట్లలోనే ప్రసవించిన మహిళ

ముంబై ఇండస్ట్రియల్ ఏరియా భివండికి సమీపంలో ఉన్న ధిగాషి గ్రామానికి అనుసంధానంగా ఉన్న ధర్మిపాదకు చెందిన డషానా ఫరాలె అనే మహిళ(32)కు సెప్టెంబర్ 1 ఉదయం 7 గంటల సమయంలో నొప్పులు వచ్చాయట. సమీప ఆసుపత్రికి తీసుకెళ్లడానికి రోడ్డు లేకపోవడంతో.. అదే గ్రామానికి చెందిన 8-10 మంది యువకులు దుప్పట్లో ఆమెను పట్టుకుని ఆసుపత్రికి బయల్దేరారు. 30-45 నిమిషాలు వెళ్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటుంది

Maharashtra: ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. దుప్పట్లలోనే ప్రసవించిన మహిళ

Maharashtra pregnant woman carried to hospital in bedsheet

Maharashtra: ఆకాశానికి రాకెట్లు పంపడంలో ప్రపంచ దేశాల్ని తలదన్నుతున్న మన దేశంలో కిద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరిజన గ్రామాలకు ఇప్పటికీ కనీస రవాణా వసతి కల్పించలేకపోతున్నాం. రోడ్డు వసతి లేని కారణంగా ఒక గర్భిణినికి పురిటి నొప్పులు వస్తే దుప్పట్లో మోసుకురావాల్సి వచ్చింది. అలా మోసుకొస్తుండగా దారి మధ్యలోనే ఆమె ప్రసవించింది. కానీ దురదృష్టం.. పుట్టిన కొద్ది సమయానికి చిన్నారి మరణించింది. ఇది జరిగింది ఏ అడవి మారు ప్రాంతంలోనో కాదు. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైకి సమీపంలోనే ఉన్న ఒక గ్రామంలో జరిగింది.

ముంబై ఇండస్ట్రియల్ ఏరియా భివండికి సమీపంలో ఉన్న ధిగాషి గ్రామానికి అనుసంధానంగా ఉన్న ధర్మిపాదకు చెందిన డషానా ఫరాలె అనే మహిళ(32)కు సెప్టెంబర్ 1 ఉదయం 7 గంటల సమయంలో నొప్పులు వచ్చాయట. సమీప ఆసుపత్రికి తీసుకెళ్లడానికి రోడ్డు లేకపోవడంతో.. అదే గ్రామానికి చెందిన 8-10 మంది యువకులు దుప్పట్లో ఆమెను పట్టుకుని ఆసుపత్రికి బయల్దేరారు. 30-45 నిమిషాలు వెళ్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటుంది. అయితే సగం దూరానికి రాగానే డషానా ప్రసవించింది. వీలైనంత తొందరగా ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్దామని వెళ్తుండగా చిన్నారి ఏడుపు ఆగింది. చూస్తే.. చిన్నారి మరణించిందని ఆదేశ్ రాయత్ అనే వ్యక్తి తెలిపాడు.

‘‘గతంలో ఇలాంటి అనేక ఘటనలు జరిగాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. 100 కుటుంబాలు ఉన్న మా గ్రామానికి 1.5 కిలోమీటర్ల మేర రోడ్డు వేస్తే రవాణా సౌకర్యం పెరుగుతుంది. పదేళ్ల నుంచి ప్రభుత్వం ముందు ఈ డిమాండ్ పెట్టినప్పటికీ ఇప్పటికీ తమను ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలా ఇంకెన్నేళ్లు మా బతుకులు కొనసాగించాలో, ఇంకా ఎంత మంది ప్రాణాలు కోల్పోవాలో తెలియట్లేదు’’ అని అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి అన్నారు. తాజా విషయమై భివండి అధికారులకు సమాచారం ఇవ్వగా.. ఆ మర్నాడు వైద్య సిబ్బంది వచ్చి ఫరాలెను చూసి వెళ్లారు. సదరు గ్రామానికి తమ ఉద్యోగులను పంపనున్నట్లు భివండి తహశీల్దార్ తెలిపారు.

MLAs Return To Ranchi: జార్ఖండ్‭లో హైటెన్షన్.. రాయ్‭పూర్ నుంచి తిరుగు ప్రయాణమైన జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు