మహారాష్ట్రలో కొత్తగా 58,924 కరోనా కేసులు

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా విజృంభణ కొన‌సాగుతోంది.

మహారాష్ట్రలో కొత్తగా 58,924 కరోనా కేసులు

Maharashtra Reports 58924 New Cases

Maharashtra మ‌హారాష్ట్ర‌లో క‌రోనా విజృంభణ కొన‌సాగుతోంది. దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాల‌ప‌రంగా మ‌హారాష్ట్ర తొలిస్థానంలో కొన‌సాగుతోన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇవాళ కొత్త‌గా 58,924 క‌రోనా కేసులు, 351 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 38,98,262కు, మ‌ర‌ణాల సంఖ్య 60,824కు చేరింది.

మ‌రోవైపు గ‌త 24 గంట‌ల్లో 52,412 మంది క‌రోనా రోగులు కోలుకుని ఆసుప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో క‌రోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 31,59,240కు చేరిన‌ట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్ర‌స్తుతం 6,76,520 యాక్టివ్ క‌రోనా కేసులు ఉన్న‌ట్లు వెల్ల‌డించింది.

ఇక, మహారాష్ట్ర త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి రెడీ అవుతోందంటూ మంత్రి ఆదిత్య ఠాక్రే ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ థర్డ్ వేవ్..సెకండ్ వేవ్ కంటే బలంగా ఉంటుందా? బలహీనంగా ఉంటుందా? అని మాత్రం ఇప్పుడే నిర్ధారించలేమని అన్నారు. కరోనా దృష్ట్యా రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయమూ గత ఏడాది ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ఆధారంగా తీసుకుంటున్నదని, ఇందులో రాజకీయాలకు ఏమాత్రం తావులేదని ఆదిత్య ఠాక్రే సృష్టం చేశారు. కోవిడ్ టీకా ఇప్పటికిప్పుడే పని చేకపోయినా, భవిష్యత్తులో విష్యత్తులో ఇది ఎంతో ఉపయోగంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు.