Zika Virus: మహారాష్ట్రలో తొలి జికా వైరస్ కేసు.. అదే వ్యక్తికి చికెన్ గున్యా

మహారాష్ట్రలో తొలి జికా వైరస్ కేస్ నమోదైంది. పూణె జిల్లాలోని పురందర్ తహసీల్ పరిధిలో 50ఏళ్ల మహిళకు లక్షణాలు కనిపించడంతో పరీక్షలు జరిపారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)జులై 30న ఆమెకు పరీక్షలు జరిపి జికా వైరస్ తో పాటు చికెన్ గున్యా కూడా ఉన్నట్లు నిర్ధారించింది.

Zika Virus: మహారాష్ట్రలో తొలి జికా వైరస్ కేసు.. అదే వ్యక్తికి చికెన్ గున్యా

Zika Virus

Zika Virus: మహారాష్ట్రలో తొలి జికా వైరస్ కేస్ నమోదైంది. పూణె జిల్లాలోని పురందర్ తహసీల్ పరిధిలో 50ఏళ్ల మహిళకు లక్షణాలు కనిపించడంతో పరీక్షలు జరిపారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)జులై 30న ఆమెకు పరీక్షలు జరిపి జికా వైరస్ తో పాటు చికెన్ గున్యా కూడా ఉన్నట్లు నిర్ధారించింది.

జికా వైరస్ అనేది దోమల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. జబ్బు తీవ్రత అనేది చాలా తక్కువగా అనిపించొచ్చని స్టేట్ సర్వేలెన్స్ ఆఫీసర్ డా.ప్రదీప్ అవాతె అంటున్నారు. కుటుంబంలోని ముగ్గురికి పరీక్షలు జరిపాం. ఒక కూతురికి చికెన్ గున్యా జ్వరం, మరొకరైన కొడుకుకి ఎటువంటి ఇన్ఫెక్షన్లు లేవు. ఏదేమైనా అందరూ క్షేమంగా ఉన్నారని డా.అవాతె అంటున్నారు.

ఈ ఇన్ఫెక్షన్ సాధారణ లక్షణాలు ఒంటి నొప్పులు, కంటి శుక్లాలు, రెట్రో ఆర్బిటల్ పెయిన్, చర్మంపై మచ్ఛలు లాంటివి కనిపిస్తాయి. జులై 15 నుంచి ఆమెలో జికా వైరస్ లక్షణాలు కనిపిస్తుండగా, జులై 30నుంచి చికెన్ గున్యా కూడా సోకిందని తెలిపారు.

గ్రామంలో జ్వరంతో ఉన్న వారు బెల్సార్ లోని ప్రైమరీ హెల్త్ సెంటర్ లో రిపోర్ట్ చేయాలని సూచించారు. ఈ మేరకు జులై 16నుంచి ఐదుగురు శాంపుల్స్ పంపించగా ముగ్గురికి చికెన్ గున్యా ఉన్నట్లు తేలింది. నిపుణులు చెప్పిన దానిని బట్టి జికా వైరస్ ఇన్ఫెక్షన్ దోమ కుట్టిన 14రోజుల తర్వాత బయటపడుతుంది.

జికా ఇన్ఫెక్షన్ గురించి ఆందోళన పడొద్దని జిల్లా అడ్మినిష్ట్రేన్ చెబుతుంది. ‘క్షేత్ర స్థాయిలో సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. వ్యాప్తి కాకుండా అడ్డుకునేందుకు కఠినంగా శ్రమిస్తున్నాం. సాధ్యమైనంత వరకూ హెల్త్ కేర్ అందిస్తాం’ అని జిల్లా అధికారి అన్నారు.