Maharashtra : రూపాయికే లీటరు పెట్రోల్..ఎగబడ్డ జనాలు..!

పెట్రోలు ధర సెంచరీలు కొట్టేస్తున్న ఈ రోజుల్లో లీటర్ పెట్రోలు కేవలం ఒకే ఒక్క రూపాయికి ఇస్తుంటే జనాలు క్యూలు కట్టేయకుండా ఉంటారా? ఏంటీ లీటర్ పెట్రోలు రూపాయికా? అనే షాక్ అయ్యే రోజులు మరి ఇవి. ఈక్రమంలో ఆదివారం (జూన్ 13,2021) మహారాష్ట్రలోని ఓ పెట్రోల్ బంకులో లీటరు పెట్రోలు రూపాయికే పోస్తున్నారని తెలిసి జనాలు కిలోమీటర్ల కొద్దీ క్యూ కట్టారు.

Maharashtra : రూపాయికే లీటరు పెట్రోల్..ఎగబడ్డ జనాలు..!

Litre Petrol Rs 1

Aditya Thackeray’s birthday litre petrol Rs 1 : పెట్రోలు ధర సెంచరీలు కొట్టేస్తున్న ఈ రోజుల్లో లీటర్ పెట్రోలు కేవలం ఒకే ఒక్క రూపాయికి ఇస్తుంటే జనాలు క్యూలు కట్టేయకుండా ఉంటారా? ఏంటీ లీటర్ పెట్రోలు రూపాయికా? అనే షాక్ అయ్యే రోజులు మరి ఇవి. ఈక్రమంలో ఆదివారం (జూన్ 13,2021) మహారాష్ట్రలోని ఓ పెట్రోల్ బంకులో లీటరు పెట్రోలు రూపాయికే పోస్తున్నారని తెలిసి జనాలు కిలోమీటర్ల కొద్దీ క్యూ కట్టారు. ఇంతకూ ఏదో విశేషం లేకపోతే ఇలా రూపాయికే ఎందుకిస్తారు? నిజమే మరి విశేషమే.

అదేమంటే మ‌హారాష్ట్ర యువ‌నేత‌..పర్యావరణ మంత్రి ఆదిత్యా థాక్రే పుట్టిన‌రోజు సంద‌ర్బంగా ఆయన అభిమానులు లీటరు పెట్రోలు రూపాయికే విక్రయించారు ఓ పెట్రోలు బంకులో. డోంబివ‌లీ యువ‌సేన ఠాణేలోని ఓ పెట్రోల్ బంకులో రూపాయికే పెట్రోల్‌ను అందించారు. దీంతో పెట్రోల్ కోసం వాహ‌న‌దారులు కిలోమీట‌ర్ల మేర వరకూ క్యూలు క‌ట్టారు. అలాగే మరీ రూపాయికీ 10 రూపాయకలకు కాకపోయిన ముంబైలోనే మరో బంకులో రూ.50కి లీటర్ పెట్రోల్‌ను అందించారు. అమ‌ర్నాథ్ వింకో న‌కాలోని ఓ పెట్రోల్ బంకులో మ‌ధ్యాహ్నం ఒంటిగంట వ‌ర‌కు వ‌చ్చిన వారికి రూ.50కి లీటర్ పెట్రోల్‌ను అందించారు.దీన్ని జనాలు చక్కగా సద్వినియోగం చేసుకున్నారు.

కాగా దేశంలో గత కొంతకాలం నుంచి పెట్రోల్..డీజిల్ ధ‌ర‌లు పరుగులు తీసున్నాయి. ధరలుఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ప్రజలు వాహనాలు బయటకు తీయాలంటేనే హడలిపోతున్నారు. ఇప్ప‌టికే దేశంలో పలు రాష్ట్రాల్లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.100 దాటిపోయింది. దీంతో వాహ‌నాలు బ‌య‌ట‌కు తీసేందుకు సామాన్య‌లు ఆలోచిస్తున్నారు. ఎక్కడికన్నా వెళ్లాలంటే సాధ్యమైనంత వరకూ పబ్లిక్ ట్రాన్స్ పోర్టు ను వినియోగించుకోవాలనుకుంటున్నారు.

కానీ అదికూడా సాధ్యం కావట్లేదు ఈ లాక్ డౌన్ సమయ నిబంధనలతో.అస‌లే క‌రోనా స‌మ‌యం. ఉద్యోగాలు లేక..ఉపాధి కోల్పోయిన ఈ కష్టకాలంలో రోజురోజుకు జీవ‌నం క‌ష్ట‌మ‌ైపోతోంది. ఈ సమయంలో పెట్రోల్ ధ‌ర‌లు పెర‌గ‌డంతో సామాన్యుడిపై మ‌రింత భారంగా మారాయి.ఈక్రమంలో మరి సందర్భం ఏదైనా కానివ్వండీ.. తక్కువ ధరకే పెట్రోలు ఇస్తామంటే జనాలు డ్యూటీలకు వెళ్లటం మానేసి వెళ్లకుండా ఉంటారా? అందుకే లీటరు పెట్రోలు రూపాయికే అనేసరికి ఎగబడి మరీ వెళ్లిపోయించుకున్నారు.