COVID-19 vaccine: మహారాష్ట్ర కీలక నిర్ణయం.. 18-44ఏళ్ల వయస్కులకు వ్యాక్సిన్ రద్దు

మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. 18నుంచి 44ఏళ్ల వయస్సున్న వారందరికీ కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలనే నిర్ణయాన్ని సస్పెండ్ చేసింది.

COVID-19 vaccine: మహారాష్ట్ర కీలక నిర్ణయం.. 18-44ఏళ్ల వయస్కులకు వ్యాక్సిన్ రద్దు

Covid Vaccine

COVID-19 vaccine: మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. 18నుంచి 44ఏళ్ల వయస్సున్న వారందరికీ కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలనే నిర్ణయాన్ని సస్పెండ్ చేసింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపె మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం 45ఏళ్ల పైబడ్డ వారికి సెకండ్ డోస్ వేయడానికి ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు.

వ్యాక్సిన్ల కొరత కారణంగా ప్రస్తుతం 18 నుంచి 44ఏళ్ల వయస్సున్న వారికి వ్యాక్సిన్ వేయడాన్ని వాయిదా వేద్దాం. 2.75 లక్షల వ్యాక్సిన్ డోసులు మిగిలి ఉన్నాయి. వీటిని 45ఏళ్లు పైబడ్డ వారికి మాత్రమే వేయనున్నారు.

అంతేకాకుండా పేషెంట్లు మ్యుకోర్మికోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ జబ్బుతో సతమతమవుతున్నారు. మహాత్మా జ్యోతిబాపూలె జన్ ఆరోగ్య యోజన పథకంలో భాగంగా వారందరికీ ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. రాష్ట్రంలో రీసెంట్ గా 2వేల కేసులు నమోదుకాగా 8మంది ఇన్ఫెక్షన్ పెరిగి చనిపోయారు. ఈ పేషెంట్ల కోసం స్పెషల్ వార్డులు ఏర్పాటు చేశారు.

బుధవారం క్యాబెనెట్ మీటింగ్ జరిగిన తర్వాత లాక్ డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటాం. ఏప్రిల్ నెలారంభం నుంచి మే14వరకూ లాక్ డౌన్ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందులో భాగంగా ఆహార వస్తువులను రోజులో కొద్ది గంటల పాటే అమ్మాలని ప్రభుత్వం సూచించింది.

మహారాష్ట్రలో రోజుకు 60వేల కొవిడ్ కేసులు నమోదవుతుండగా.. ముంబైలో మాత్రమే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.